రోజూ ఫేస్బుక్ చూస్తుంటే టైమ్, డాటా రెండూ సరిపోవు. రోజులో ఎక్కువ డాటా యూజ్అయ్యే వాటిలో ఫేస్బుక్ యాప్ ఒకటి. తక్కువ డాటా ప్లాన్ వాడుతున్న వాళ్లకు ఫేస్బుక్ వల్ల నెట్ తొందరగా అయిపోతుంది. అలాగని ఫేస్బుక్చూడకుండా ఉండలేరు. దీనికో పరిష్కారం ఉంది. ఫేస్బుక్లో డాటా సేవ్ ఆప్షన్ ఉంది. ఫేస్బుక్ యాప్‌లో పైన కనిపించే ‘హ్యాంబర్గర్’ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ కనిపించే సెట్టింగ్స్, ప్రైవసీపై ట్యాప్ చేసి, కింద కనిపించే డాటా సేవర్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి.
దీనివల్ల ఫేస్బుక్లో యూజర్లు చూసే ఫొటో, వీడియోల సైజు తగ్గుతుంది. కొంచెం తక్కువ క్వాలిటీతో వీడియోలు ప్లే అవుతుంటాయి. లో క్వాలిటీతోనే వీడియోలు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆటో ప్లే వీడియో ఆప్షన్ కూడా ఆగిపోతుంది. దీనివల్ల తక్కువ డాటాతోనే చాలా సేపు ఫేస్బుక్ చూడొచ్చు.