ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగదు. ఆధార్ కార్డు అనేది ఇప్పుడు తప్పనిసరిగా డాక్యుమెంట్ ఐడెంటిటీలో ఇది కీలక చాలా కీలకం. బ్యాంకు అకౌంటు ఓపెన్ చేయాలన్నా..పాస్ పోర్టు కు అప్లయ్ చేయాలన్నా..ఏ ఇతర ప్రభుత్వ పథకాలు, పనులకు సంబందించి ఆధార్ కార్డును ఉపయోగిస్తుంటాం..అలాంటి సమయంలో గుర్తింపుకోసం ఈ కార్డును ఉపయోగించినప్పుడు డేటా దుర్వినియోగం కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆధార్ కార్డు దుర్వినియోగం అయితే అది చట్టపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ ఆధార్ కార్డును భద్రంగా ఉంచుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున మీ కార్డు మిస్ అయినప్పుడు స్కామర్లనుంచి మీ డేటాను భద్రంగా ఉంచుకోవచ్చు.
ఆధార్ కార్డు సమాచారం షేర్ చేసినప్పుడు జరిగే అనర్ధాలు
సాధారణంగా మనం KYC పేరుతో ఆధార్ కార్డు, పాన్ కార్టు వంటి డాక్యుమెంట్లు షేర్ చేస్తుంటాం. సిమ్ కార్డు కొనుగోలు చేసేందుకు గానీ, బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసేందుకు, కొత్తగా ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకునేందుకు ఇలా కొన్ని రకాల పనులకోసం డేటా షేర్ చేస్తుంటాం.
అయితే కొన్ని కొన్ని సార్లు బ్యాంకు రిప్రజెంటేటివ్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, మార్కెటింగ్ వ్యక్తులు ఆధార్, పాన్ కార్డు ద్వారా మన డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఇవి బ్యాంకింగ్ ఫ్రాడ్స్, సైబర్ నేరాలకు దారితీస్తాయి.
UIDAI ఏం సలహా ఇస్తోంది?
ప్రభుత్వ ఏజెన్సీ,ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ ఆధార్ కార్డు వినియోగం గురించి కొన్ని సలహాలు సూచనలు చేసింది. మీ ఆధార్ కార్డు నంబర్ ను ఎప్పుడూ ఎవరితో షేర్ చేసుకోకూడదని తెలిపింది. ఒక వేళ పొరపాటున షేర్ చేస్తే మీ కార్డు వెంటనే లాక్ చేసుకోవాలని సూచిస్తుంది. ఇంటి నుంచే ఆధార్ కార్టును ఎలా లాక్ చేసుకోవాలో తెలిపింది.
ఆధార్ కార్డును ఎలా లాక్ చేయాలి?
- మొదట UIDAI వెబ్ సైట్ https://uidai.gov.in/](https://uidai.gov.in/ వెళ్లాలి.
- భాషను ఎంపిక చేసుకుని తరువాత పేజీలోకి వెళ్లాలి.
- UIDAI హోం పేజీలో కిందకు స్క్రోల్ చేసి Access Aadhaar services ను కనుగొని క్లిక్ చేయాలి.
- Lock/Unlock Biometrics ఆప్షన్ ను బటన్ క్లిక్ చేయాలి
- తర్వాత పేజీలోlock your Aadhaar card ఆప్షన్ ఉంటుంది, దానిని క్లిక్ చేసి మీ ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు.
అయితే ఆధార్ కార్డు లాక్ చేసే ముందు వర్చువల్ ఐడీని జనరేట్ చేసుకోవాలి. ఇందుకోసం https://resident.uidai.gov.in/genericGenerateOrRetriveVID సందర్శించాలి.
ఈ విధంగా ఒక్కొక్క స్టెప్ ఫాలో అవుతూ పోతే ఈజీగా ఆధార్ కార్డును లాక్ చేయొచ్చు. దీంతో మీ డేటా సురక్షితంగా, దుర్వినియోగం కాకుండా రక్షించబడుతుంది.