షోరూంలలో మిగిలిపోయిన బట్టలను ఎలా అమ్ముతారు.. ఏం చేస్తారు..

షోరూంలలో మిగిలిపోయిన బట్టలను ఎలా అమ్ముతారు.. ఏం చేస్తారు..

బట్టల షాపుల్లో  అమ్ముడుపోని బట్టలను ఏం చేస్తారు. వాటిని పడేస్తారా..? ఇంకేమైనా చేస్తారా..?   ఆ నష్టాన్ని షాపు యజమానే భరిస్తారా..? లేక బట్టల కంపెనీ భరిస్తుందా..?  ఇది  ప్రతీ ఒక్కరి మెదడులో మెదిలే ప్రశ్న. ప్రతి పండగ  సీజన్ లేదా...ఏడాది ముగింపులో అమ్ముడు పోకుండా బట్టలు మిగిలిపోతుంటాయి. అయితే  చాలా మంది  వినియోగదారులకు ఈ బట్టలను ఏం చేస్తారో తెలియదు. ఈ క్రమంలో ఈ ప్రశ్నలపై  ఓ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో వినియోగదారులు ఆశ్యర్యపోయే సమాధానాలు చెప్పారు. 

రాయితీపై విక్రయిస్తారు  

బట్టల షాపుల్లో మిగిలిపోయిన బట్టలను ఏం చేస్తారనే ప్రశ్నకు ఓ వినియోగదారుడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. పలు షాపుల్లో మిగిలిపోయిన బట్టలను డిస్కౌంట్ సేల్ లో అమ్ముతారని చెప్పాడు. మరికొందరు ఆన్ లైన్ లో తక్కువ ధరకు విక్రయిస్తారని పేర్కొన్నాడు. అందుకే కొన్ని క్లాథ్స్ స్టోర్లలో ఏడాది ముగింపు సమయంలో 50 శాతం విక్రయాలు నిర్వహిస్తారని తెలిపారు.

ALSO READ: Weekend Tour : బోడకొండ అందాలు చూసొద్దామా.. జస్ట్ 60 కిలోమీటర్లే
 

బట్టలు దానం చేస్తారు

డిస్కౌంట్ సేల్ తర్వాత కూడా  బట్టలు అమ్ముడుపోకుండా ఉంటే బట్టల దుకాణం వారు వాటిని దానం ఇస్తారని ఓ వినియోగదారులు తెలిపాడు. అనాధాశ్రమాలకు  విరాళంగా అందజేస్తారని చెప్పాడు. లేదా తక్కువ ధరలకు విక్రయిస్తారని వెల్లడించాడు. 

ఫెస్టివల్ సేల్‌లో విక్రయిస్తారు

కొన్ని బ్రాండెడ్ బట్టలు ఎన్ని నెలలున్నా..కొత్తగానే కనిపిస్తాయి. ఇలాంటి వాటిని ఫెస్టివల్ సేల్‌లో విక్రయిస్తారు. నిధి జోషి ఓ  యూజర్...షోరూంలలో మిగిలిపోయిన బట్టలను ఈరోజు కాకపోతే రేపు  అమ్ముకుంటారని తెలిపారు. కొన్ని సమయాల్లో అమ్ముడవని బట్టలను పండుగ రోజున సేల్‌  నిర్వహిస్తారని ..తక్కువ లాభం వచ్చినా అమ్ముడుపోని బట్టలను వదిలించుకుంటారని చెప్పారు. 

ఇతర బట్టల ద్వారా లాభం..

బట్టల షాపు యజమానులు తమ బట్టలను లాభాలతో విక్రయిస్తారని మరో వినియోగదారులు వెల్లడించాడు. కాబట్టి మిగిలిపోయిన బట్టల వల్ల వారికి నష్టం జరగదని తెలిపారు. మరో వినియోగదారుడు అయితే..ఇలాంటి మిగిలిపోయిన బట్టలను గ్రామాలు, లేదా పేదలకు మాయమాటలు చెప్పి విక్రయిస్తారని పేర్కొన్నాడు.