నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెస్సేజ్ పంపొచ్చు

నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్‌లో మెస్సేజ్ పంపొచ్చు

గతంలో ఎవరికైనా వాట్సాప్ లో ఫొటో, మెస్సేజ్ పంపాలంటే వాళ్ల ఫోన్ నెంబర్ ఫీడ్ చేసుకోవల్సిందే.. కానీ ఇప్పుడు అలా కాదు.. అన్ నౌట్ నెంబర్స్ కూడా డైరెక్ట్ వాట్సాప్ మెస్సేజ్ చేయొచ్చు. ఈ కొత్త ఫీచర్ ను వాట్సాప్ తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 2.4 బిలియన్ల యూజర్లు ఉన్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌తో ముందుకు వస్తోంది. మంచి ఫీచర్స్ తో వాట్సాప్ యూజర్ యాక్టివిటీని పెంచుకుంటుంది.

 నెట్ సెంటర్ కు వెళ్లి ప్రింట్ అవుట్ తీసుకోవాలన్నా, కొత్త వ్యక్తులకు ఏదైనా ఫైల్, ఫొటో షేర్ చేయాలన్నా వాళ్ల నెంబర్ ను ఫోన్ లో ఫీడ్ చేసుకుంటాం.. తర్వాత వాళ్ల నెంబర్ తో పని ఉందదు. అది అలాగే ఉండిపోద్ది. చిన్న పని కోసం వాళ్ల నెంబర్ సేవ్ చేసుకోవడం, డిలెట్ చేయడం తరుచూ చేయలేం.. అందుకే ఈ మెటా వాట్సాప్ లో ఈ ఫీచర్ తీసుకొచ్చింది.దీని గురించి సింపుల్‌గా తెలుసుకుందాం.

వాట్సప్‌ని ఓపెన్ చేసి ఐఫోన్ యూజర్లైతే పైన ప్లస్ ఐకాన్, ఆండ్రాయిడ్ యూజర్లైతే వాట్సప్ యాప్‌లో కింద ప్లస్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తర్వాత సర్చ్ కాంటాక్ట్‌పై క్లిక్ చేసి నంబర్‌ని మీరు మెస్సేజ్ చేయాలనుకునే నెంబర్ ఎంటర్ చేయండి. ఆ నంబర్‌పై వాట్సప్ అకౌంట్ ఉంటే చాట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫైల్స్, ఫొటోలు తదితర సమాచారాన్ని నంబర్ సేవ్ చేసుకోకుండానే షేర్ చేయొచ్చు.