వాట్సాప్‌లోనే కాదు... ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా లొకేషన్ షేర్ చేయొచ్చు. గంట వరకు లైవ్ లొకేషన్ ఆన్‌లో ఉంటుంది. లొకేషన్ రీచ్ అయ్యాక డిఫాల్ట్‌గా ఆఫ్ అవుతుంది. డైరెక్ట్ మెసేజ్‌లో ప్రైవేట్‌గా మాత్రమే షేర్ అవుతుంది. షేరింగ్ లొకేషన్ చాట్‌లో ఉన్న ఇద్దరికీ కనిపిస్తుంది. ఇతరులకు ఫార్వర్డ్ చేయడం కుదరదు. ఇన్స్టాగ్రామ్ లైవ్ లొకేషన్ షేరింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని చాట్ పైన ఒక గుర్తు కనిపిస్తుంటుంది.
యూజర్లు నచ్చిన టైంలో లొకేషన్ షేరింగ్‌ని ఎండ్ చేయొచ్చు కూడా. అంతేకాదు, ఈ ఫీచర్‌తో కాన్సర్ట్‌లు, క్రికెట్మ్యాచ్లు, సభలు వంటి ప్రదేశాల్లో మీ ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ పర్సన్స్ ఎక్కడున్నారో తెలుసుకునేందుకు మ్యాప్‌లో ఒక లొకేషన్ పిన్ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది.