ఐఫోన్లో ఒక సరికొత్త అప్డేట్ వచ్చింది. ఇప్పటివరకు ఐఫోన్లో లేని ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది. అదేంటంటే.. ఇకపై ఐఫోన్లో కూడా ఆండ్రాయిడ్లానే బ్యాటరీ ఛార్జింగ్ స్టేటస్ కనిపిస్తుంది. దాంతో పాటు మరికొన్ని వివరాలు కూడా అందిస్తుంది. రాబోయే ఐఒఎస్ 18 వెర్షన్ ఐఫోన్ యూజర్లు ఈ ఫీచర్‌ను పొందొచ్చు.
ఆండ్రాయిడ్ ఫోన్ ఛార్జ్ చేసినప్పుడు, పూర్తి ఛార్జ్ చేసేందుకు ఎంత టైం మిగిలి ఉందో కూడా చూపిస్తుంది. ప్రస్తుతం బ్యాటరీ లెవల్ ఆధారంగా 25 నిమిషాలు లేదా 75 నిమిషాలు ఉండొచ్చు. ఈ ఫీచర్‌కు బ్యాటరీ ఇంటెలిజెన్స్ అనే కోడ్ నేమ్ ఉంది. మరికొన్ని నెలల్లో ఇది అందుబాటులోకి రావొచ్చు.