మనస్పర్థలతో ఫ్రెండ్స్ మద్య గ్యాప్.. ఈ గ్యాప్ రావొద్దంటే..

గ్యాప్ పెరగనీయొద్దు

ఏ బంధం లేకపోయినా కష్టసుఖాల్లో పాల్పంచుకునే వాళ్లే ఫ్రెండ్స్. ఒక్కసారి మనసుకు దగ్గరైతే చాలు జీవితకాలం తోడుగా ఉంటారు. అటువంటి ఫ్రెండ్స్ మధ్య అప్పుడప్పుడు మనస్పర్థలు వస్తుంటాయి. స్కూల్లో, కాలేజీల్లో, ఆఫీసుల్లో.. ఎక్కడో ఓ చోట ఇలాంటివి ఎదురవుతుంటాయి. ఆ మనస్పర్థలు స్నేహితుల మధ్య గ్యాప్​ క్రియేట్​ చేస్తాయి. ఆ గ్యాప్​ని దూరం చేసుకోవడానికే ఈ టిప్స్. ఈ  చిన్న చిన్న మార్గాల ద్వారా బెస్ట్ ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మళ్లీ దగ్గరకావొచ్చు. బంధాన్ని మరింత బలంగా మార్చుకోవచ్చు.

మనస్పర్ధలు వచ్చిన తరువాత చాలామంది గ్యాప్ తీసుకుంటుంటారు. ఇలా కొంత టైం గ్యాప్ తీసుకోవడం మంచిదే. కానీ, అదే గ్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కంటిన్యూ చేయకూడదు. అసలు ‘సమస్య  ఎక్కడ వచ్చిందో..ఎందుకు వచ్చిందో’ తెలుసుకోవాలి. ఇద్దరూ విడిపోవడానికి బలమైన కారణం ఉందా? అనే విషయాన్ని వెతకాలి. దాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. అప్పుడే స్నేహితుల మధ్య ఎక్కువ గ్యాప్ రాకుండా ఉంటుంది.

ముందడుగు వేయాల్సిందే

ఇద్దరిలో ఎవరి తప్పు ఉన్నా ..ఎవరో ఒకరు ముందడుగు వేయాలి. ప్రాబ్లమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. తప్పు ఎవరిదైనా అంగీకరించడానికి సిద్ధమవ్వాలి. లేదంటే క్షమించే గుణమైనా ఉండాలి. తప్పులు ఎత్తకుండా, ‘నేనే ముందు ఎందుకు మాట్లాడాలి..?’ అని అనుకోకుండా ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్, మెసేజ్ చేయడమో చేయాలి. లేదంటే ఇద్దరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకోవాలి. దీంతో ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు పోతాయి.

నిందించొద్దు..

తప్పు ఎవరిదైనా నిందించకూడదు. ఒకవేళ తప్పు నిజంగా ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దే అయినా ఆ విషయాన్ని పదే పదే చెప్పకూడదు. ఒకవేళ చెప్పాల్సి వస్తే నిదానంగా వివరించాలి. క్లారిటీగా చెప్పాలి. ఇద్దరి వైపు నుంచి ఆలోచిస్తున్నట్లే మాట్లాడాలి. అంతేగాని జరిగిపోయిన వాటిని గుర్తుచేస్తూ పొడిచినట్లు మాట్లాడకూడదు.

ఓపిక అవసరం

తప్పు ఎదుటివాళ్లదే అయినా.. మీరే ముందడుగు వేసినా ఒకవేళ స్నేహితుడు మీ సంజాయిషీని అంగీకరించకపోతే బాధపడొద్దు. ‘నేనే ముందు మాట్లాడా..’ అన్న మాటలు ఇద్దరి మధ్య రాకూడదు. ఇలాంటి టైంలోనే ఓపిక అవసరం. క్లారిటీ ఇచ్చిన తరువాత అవతలివాళ్లు తిరిగి మాట్లాడకపోయినా.. చెప్పేది అర్థం చేసుకోకపోయినా వాళ్లు ఆలోచించుకోడానికి కొంత టైం ఇవ్వాలి. అంతేగాని ‘నేను మాట్లాడేశా.. నువ్వు కూడా మాట్లాడు’ అనే ధోరణి కరెక్ట్ కాదు.

పాజిటివ్ విషయాలే గుర్తుంచుకోవాలి

స్నేహితులతో విడిపోయి దూరంగా ఉన్నప్పుడు వాళ్ల గురించి పాజిటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ఆలోచించాలి. అంతకుముందు ఇద్దరి మధ్య జరిగిన మంచి మంచి సంఘటనలు గుర్తు చేసుకోవాలి. ఇలా పాజిటివ్ థింకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే ఇద్దరూ మళ్లీ కలిసే అవకాశం ఉంటుంది. అలాకాకుండా స్నేహితుడి గురించి నెగెటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా థింక్ చేయడం వల్ల రిలేషన్ మరింత దెబ్బ తినే ఛాన్స్ ఉంటుంది.

మూడో వ్యక్తి వద్దు

ఏ రిలేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనైనా ఇద్దరి మధ్యలో మరో వ్యక్తి రాకపోతేనే బెటర్. ఎవరి మధ్య గొడవలు వస్తే వాళ్లే పరిష్కరించుకోవాలి. మీడియేటర్స్ ఎంటరైతే ఆ గొడవ మరింత పెద్దగా అయ్యే అవకాశం ఉంది. అందుకే మూడో వ్యక్తి మాటే వద్దు.

ఇగోతోనే గ్యాప్!

ఏ బంధంలోనైనా గొడవలు రావడం సహజం. వచ్చినా.. వాటిని పరిష్క రించు కోవడమే ముఖ్యం. ఒకవేళ పరిష్కరించక పోయినా పర్వాలేదు కానీ, గొడవను ఇంకా పెంచుకోకూడదు. ముఖ్యంగా ఫ్రెండ్స్ మధ్య ఇగోలు ఉండకూడదు. ఇగోలతోనే గొడవలు వస్తుంటాయి. గొడవలు వచ్చిన తరువాత కూడా ఈ ఇగోలతోనే గ్యాప్ ఇంకా పెరుగు తుంది. ‘తప్పు నీదే కాబట్టి నువ్వే మాట్లాడాలి, నీకే అంత లెవల్ ఉంటే నాకెంత ఉండాలి..’ అనే ధోరణి పనికిరాదు. ఫ్రెండ్ కోసం ఆలో చించాలి. తగ్గాలి. క్షమించాలి. అప్పుడే గ్యాప్ ఇంకా పెరగకుండా ఉంటుంది.

– డా. హరిణి అట్టూరి, సైకియాట్రిస్ట్

కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్

For More News..

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు