ట్రాఫిక్‌‌‌‌ సమస్యను ఎలా పరిష్కరిద్దాం?

ట్రాఫిక్‌‌‌‌ సమస్యను ఎలా పరిష్కరిద్దాం?
  • కన్వర్జేషన్ మీటింగ్​లో చర్చించిన పోలీసులు, బల్దియా అధికారులు
  • ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్లానింగ్

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: గ్రేటర్‌‌‌‌‌‌‌‌లో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలపరిష్కారాలపై పోలీసులు, జీహెచ్‌‌‌‌ఎంసీ అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్‌‌‌‌ ఫ్రీ మూవ్‌‌‌‌మెంట్‌‌‌‌ కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి నెల నిర్వహించే ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశంలో భాగంగా శనివారం 65వ కన్వర్జేషన్‌‌‌‌ మీటింగ్ జరిగింది.బంజారాహిల్స్‌‌‌‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్​కు జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్, సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి, రాచకొండ సీపీ సుధీర్ బాబు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హెచ్‌‌‌‌ఎండీఏ కమిషనర్ దాన కిశోర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల కలెక్టర్లు ట్రాఫిక్, మెట్రో రైలు, వాటర్ బోర్డు, ఎలక్ట్రిసిటీ‌‌‌‌ ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

గతేడాది ఆగస్ట్‌‌‌‌లో జరిగిన 64వ కన్వర్జేషన్‌‌‌‌ మీటింగ్‌‌‌‌కు సంబంధించిన అంశాలను చర్చించారు. ప్రధానంగా రోడ్ల ఆక్రమణ, పార్కింగ్, రద్దీగా ఉండే రోడ్లలో ప్రత్యామ్నాయ మార్గాలు, అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిల నిర్మాణాలు, గార్బేజ్ డంపింగ్‌‌‌‌ సహా ట్రాఫిక్‌‌‌‌ సమస్యలకు కారణమవుతున్న అంశాలపై చర్చించారు. రోడ్ల విస్తరణకు అవకాశాలను పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే రోడ్లలో ఆక్రమణల తొలగింపుపై కఠిన చర్యలు తీసుకునే విధంగా పలు సూచనలు చేశారు. వాటర్ వర్క్స్, ఎలక్ట్రిసిటీ వర్క్స్‌‌‌‌ జరుగుతున్న సమయాల్లో రోడ్ల తవ్వకాల పూడ్చివేతకు సంబంధించిన అంశాలపై ఫోకస్ పెట్టారు. ట్రాఫిక్‌‌‌‌కు ఇబ్బంది కలగకుండా అన్ని డిపార్ట్‌‌‌‌మెంట్లు కో ఆర్డినేషన్‌‌‌‌తో పనిచేసే విధంగా ప్లానింగ్ రూపొందించారు.