Health Tip : వెక్కిళ్లు తగ్గాలంటే ఇలా చేయండి

Health Tip : వెక్కిళ్లు తగ్గాలంటే ఇలా చేయండి

ఊపిరితిత్తుల కింద భాగాన డయాఫ్రేమ్ ఉంటుంది. ఇది శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అతిగా తిన్నా, తాగినా, కూల్ డ్రింక్స్ లేదా మద్యం తీసుకున్నా చాలామందికి వెక్కిళ్లు వస్తుంటాయి. ఒత్తిడి, హై ఎమోషన్స్ లో ఉన్నా కొందరికి వెక్కిళ్లు వస్తాయి. అంతేగానీ, 'ఎవరో మన గురించి తలుచుకుంటే' వెక్కిళ్లు రావు. అయితే సాధారణమైన వెక్కిళ్లకి సైంటిఫికల్గా ఎలాంటి ట్రీట్మెంట్ లేకపోయినా.. కొన్ని చిట్కాలతో వాటిని కొంత తగ్గించొచ్చు. 

ఎక్కిళ్లు ఎందుకు వస్తాయి?..

* కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం.

* శరీర ఉష్ణోగ్రతలో ఒక్కసారిగా మార్పు రావడం.

* గ్యాస్ ట్రబుల్‌‌‌‌తో పొట్ట పట్టేసినట్టు ఉన్నప్పుడు డయాఫ్రేమ్‌‌‌‌పై ఒత్తిడిపడి ఎక్కిళ్లు వచ్చే చాన్స్ ఉంది.

* ఐస్, చూయింగ్ గమ్ లాంటివి తింటున్నప్పుడు గాలి శ్వాసనాళంలోకి కాకుండా కడుపులోకి వెళ్లటం.

* ఫాస్ట్ గా తినటం, స్పీడ్ గా నీళ్లు తాగటం… ఇలా చాలా కారణాలుంటాయి.

*ఎక్కువ స్ట్రెస్​ కి గురైనా, సడన్‌‌‌‌గా ఎమోషనల్ అయినా ఎక్కిళ్లు ఆగకుండా వస్తుంటాయి.

Also Read :-కోడి గుడ్డు, పన్నీర్ కలిపి తినొచ్చా

వెక్కిళ్లు ఆగాలంటే...

* గోరు వెచ్చని నీళ్లని కొద్ది కొద్దిగా సిప్ చేయాలి. ఎక్కిళ్లు వస్తున్నప్పుడు  కూల్ డ్రింక్స్ అస్సలు ముట్టుకోవద్దు.

* చిన్న అల్లంముక్క నమిలి రసాన్ని మింగాలి.

* కప్పు నీటిలో చెంచాడు యాలకుల పొడి వేసి మరిగించి, చల్లారాక తాగినా ఎక్కిళ్లు తగ్గుతాయి.

* పెరుగులో కాసింత ఉప్పు కలుపుకుని, మెల్లమెల్లగా తింటున్నా ఆగుతాయి.

* నీళ్ల గ్లాస్ పైన టవల్ కానీ, హ్యాండ్ కర్చీఫ్ కానీ వాసెన లాగా కట్టి నీళ్లని పీల్చుకుంటున్నట్టు తాగాలి.

* ఒక్క చుక్క వెనిగర్ ని నాలుక మీద వేసుకొని చప్పరించాలి.

* చాతీమీద చిన్నగా మసాజ్ చేయాలి. లేదంటే కుర్చీ మీద కూర్చొని మోకాళ్ల మీదకి వంగి పొట్ట, చాతీ మీద కొద్దిగా ప్రెజర్ తేవాలి.

* అయితే ఈ చిట్కాలన్నీ పాటించినా ఒక రోజుకంటే ఎక్కువ సేపు ఎక్కిళ్లు వస్తుంటే మాత్రం లేట్ చేయకుండా డాక్టర్‌‌‌‌‌‌‌‌ని కలవాలి.