వాట్సాప్ ఇటీవలే ఓ కొత్త ఫీచర్‌తో యూజర్స్ ముందుకు వచ్చింది. ఇది యాప్ లో మేసేజ్ లను ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది, అక్షరదోషాలు, తప్పులు లేదా ఇతర అవాంఛిత లోపాలను సరిదిద్దడానికి అనుకూలమైన పరిష్కారాన్ని అందిస్తుంది. ఈ ఫీచర్ ప్రైవేట్ చాట్‌లను ప్రొటెక్ట్ గా ఉంచడం, వివిధ డివైజ్ లలో లాగిన్ చేయడం వంటి అన్నింటిలోనూ అప్‌డేట్‌ల ద్వారా అందుబాటులోకి వచ్చింది.
ఎడిట్ బటన్ అని పిలిచే ఎడిటింగ్ ఆప్షన్ అనేది నిర్దిష్ట సమయంలో మెసేజ్ ను సవరించడానికి యూజర్స్ ను అనుమతిస్తుంది. అనుకోని లోపాల వల్ల తలెత్తే ఇబ్బంది లేదా గందరగోళాన్ని నివారించడంలో ఈ ఫీచర్ ప్రత్యేకంగా సహాయపడుతుంది. అయితే, ఈ ఎడిటింగ్ విండో ప్రస్తుతానికైతే లిమిటెడ్ సేవలనందిస్తుండగా.. ధీర్ఘ కాలంలో ఎప్పుడైనా మార్పులు చేసేందుకు మాత్రం ఇది అనుమతించదు.
ఈ ఫీచర్ ప్రస్తుతం యూజర్స్ అందరికీ అందుబాటులో ఉంది. WhatsApp అప్ డేట్ చేయకపోతే ఈ ఫీచర్ కనిపించదు, స్వీకరించబడదు కూడా. బదులుగా యాప్ తాజా వెర్షన్‌లో అప్ డేటెడ్ అని సూచించే నోటిఫికేషన్ ను చూపిస్తుంది. వాట్సాప్ ను అప్ డేట్ చేసిన తర్వాతే ఎడిటెడ్ మెసేజ్ ను చూసేందుకు అవకాశం ఉంటుంది.
డిలీట్ ఆప్షన్‌తో పోలిస్తే, ఈ కొత్త ఫీచర్ కాస్త లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఇది మొత్తం మెసేజ్ ను తొలగించకుండా, తిరిగి రాయకుండానే చిన్న తప్పులను వెంటనే సరిదిద్దడానికి అనుమతిస్తుంది. WhatsApp ఇందులో రెండు త్యామ్నాయాలను అందిస్తోంది. అందులో ఒకటి ఎడిటింగ్, మరొకటి డిలీట్ (తొలగించడం).
మెసేజ్ ను ఎడిట్ చేసే ప్రక్రియ:
- WhatsApp యాప్‌ని ఓపెన్ చేసి, ఏదైనా చాట్‌కి నావిగేట్ చేయండి.
- సవరించాల్సిన లేదా ఎడిట్ చేయాల్సిన మెసేజ్ పై లాంగ్ ప్రెస్ చేయండి.
- ఆ తర్వాత ఎడిట్ మెసేజ్ (Edit Message) ఆప్షన్ ను ఎంచుకోండి.
అయితే ఇక్కడ గుర్తుంచుకోదగిన విషయమేమిటంటే ఈ ఎడిటింగ్ అనేది విండోలో కేవలం 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అంటే మెసేజ్ సెండ్ చేసిన 15నిమిషాల వరకే ఎడిట్ చేయొచ్చన్నమాట. ఈ సమయ వ్యవధిని దాటి, ఎడిట్ చేయడం సాధ్యం కాదు. అప్పటికీ ఏవైనా తప్పులున్నాయనిపిస్తే మెసేజ్ ను డిలీట్ చేయడం తప్ప మరో ఆప్షన్ లేదు.
మరో ముఖ్యమైన విషయమేమిటంటే.. సవరించిన లేదా ఎడిటెడ్ మెసేజ్ లు రిసీవ్ చేసుకున్న వారికి కొత్త చాట్ నోటిఫికేషన్‌లను చేయవు. తక్షణమే మార్పులు చేస్తే తప్ప, రిసీవర్స్ కు ఎడిట్ చేశామని కూడా తెలియదు. ఈ ఎడిటింగ్ ఫీచర్ టెక్స్ట్‌తో పాటు ఫొటోలు, వీడియోల వంటి మీడియా కంటెంట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది ప్రస్తుతం ఐఓఎస్ (iOS), ఆండ్రాయిడ్( Android) యూజర్స్ అందరికీ అందుబాటులో ఉంది. ఇది కమ్యూనికేషన్‌ను మరింత మెరుగుపర్చనుంది.