ఆధ్యాత్యికం : గుళ్లో తీర్ధం ఎలా పుచ్చుకోవాలి.. ప్రసాదం ఎలా తినాలి..

ఆధ్యాత్యికం : గుళ్లో తీర్ధం ఎలా పుచ్చుకోవాలి.. ప్రసాదం ఎలా తినాలి..

హిందువులు అందరూ ఏదో ఒక సందర్భంలో గుడికి వెళతారు. దేవాలయంలోని దేవుడిని దర్శించుకున్న తరువాత తీర్థం.. ప్రసాదం ఇస్తారు.  చాలామంది ఎవరికి ఇష్టం వచ్చినట్లు తీసుకుంటారు.  కొంతమంది తీర్థం తీసుకున్న చేతిని తలపై తుడుచుకుంటారు.  ప్రసాదాన్ని మొత్తం ఒకేసారి నోట్లో వేసేసుకుంటారు.  ఇలా చేస్తే చాలా అపచారమని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. మరి సాధారణంగా తీర్థాన్ని ఉద్దరణితో ( స్పూన్​) మూడు సార్లు ఇస్తారు.  

ఆలయాలకు వెళ్తాము కానీ అక్కడ ఇచ్చే దేవుడి ప్రసాదాలను ఎలాతినాలోచాలామందికి తెలియదు .  శివయ్య గుడిలో బిల్వ తీర్థం ఇస్తే...వెంకయ్య గుడిలో తులసిదళం తీర్థం ఇస్తారు .  కొంతమంది స్వయంగా చేతిలో తీసుకుంటారు..  ఇంకొంతమంది వేరొకరి చేతి నుండి వారి చేతుల్లోకి ఒంపుకుంటారు..  అలాగే గుడిలో చక్కరపొంగళి పులిహోర లాంటివి ఇచ్చినప్పుడు కూడా తినేప్పుడు పొరపాట్లు ఎన్నో జరుగుతుంటాయి. 

గుళ్లోకి వెళ్లినప్పుడు తప్పకుండా తీర్థం తీసుకోవాలి.  తీర్ధాన్ని తీసుకునేటప్పుడు... మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి.  ఆ తరువాత ఎడమచేతిపై కుడి చేతిని పెట్టి.. బొటన వేలు మడిచి  దానిపై  చూపుడువేలును  నడిమి వ్రేలి క్రింద కణుపునకు పెట్టి గట్టిగా నొక్కి పట్టి తీర్ధం క్రింద పడనీయకుండా..  నోటి శబ్దం..  రాకుండా ...ఓం అచ్యుత, అనంతా, గోవిందా అనే నామాలను స్మరిస్తూ భక్తిశ్రద్ధలతో వినమ్ర పూర్వకంగా త్రాగాలి.  తీర్ధం తాగేటప్పుడు చేతిలోకి తీసుకున్న తరువాత రెండు కళ్లకు చూపించి.. దేవుడిని స్మరిస్తూ తాగాలి. చాలామంది తీర్థం తాగాక తలపై తుడుచుకుంటారు.  అలా చేయకూడదు.... ఎందుకంటే  తలపైన బ్రహ్మదేవుడు ఉంటాడు. మన ఎంగిలిని బ్రహ్మకు అర్పణం చేసిన వారమవుతాం . రెండు చేతులను ఒకదానికొకటి తుడుచుకోవాలి.   తీర్ధం త్రాగునప్పుడు జుర్రుమని శబ్దం రాకుండా తాగాలి. 

దేవాలయాల్లో తీర్థాన్ని మూడు సార్లు ఇవ్వాలి.  కానీ ఇప్పుడు దాదాపు ప్రతి దేవాలయంలో ఒకసారే ఇస్తున్నారనుకోండి.  అలా చేస్తే భక్తులకు ఏమాత్రం నష్టం ఉండదు.  ఎందుకంటే తీర్థం ఇచ్చేది దేవాలయంలో పూజారి కదా.. దానికి సంబంధించిన పాపపుణ్యాలు ఆయనే అనుభవిస్తారు.  అయితే అసలు తీర్థం మూడు సార్లు ఎందుకు తాగాలో అనే విషయం చాలామందికి తెలియదు.  మొదటి సారి తీసుకునే తీర్థంతో శారీరక, మానసిక శుద్థి జరుగుతుంది. .. రెండోసారి తీర్థం న్యాయ ధర్మ ప్రవర్తనలు చక్కదిద్దుకుంటాయి...మూడోది పవిత్రమైన పరమేశ్వరుని పరమ పదం అనుకుంటూ తీసుకోవాలి. 

ఇక ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా పైన చెప్పిన విధంగానే మగవారు తన భుజంపై ఉన్న ఉత్తరీయం లేదా కండువాను, ఆడవారు తమ చీర లేదా చున్ని పైట కొంగును ఎడమ చేతిలో నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి.  పూలు అయితే మహిళలు పైట కొంగులోనే వేసుకోవాలి. చాలామంది చక్కెర పొంగలి కాని.. పులిహార కాని ఇంకా ఏదైనా.. ప్రసాదంగా ఇస్తే ఒకే సారి నోట్లో వేసేసుకుంటారు.  కాని అలా తినకూడదు.  కుడి చేత్తో ప్రసాదాన్ని తీసుకొని ... దాన్ని ఎడమచేతిలోకి మార్చుకొని కొద్ది కొద్దిగా నోట్లో వేసుకోవాలి.  ప్రసాదం నోట్లో వేసుకొనేటప్పుడు నోటికి చేయి తగలకూడదు.  అలా కాకుండా కుడిచేతిలోకి తీసుకుని ఒకేసారి నోటితో కొరికారంటే మరుజన్మలో పక్షులై పుడతారని పండితులు చెబుతున్నారు.  పక్షులకు చేతులు లేవు కనుక అవి కాళ్లతో తింటాయి. ఏ జీవికి  ప్రత్యేకంగా చేతులు ఉండవు.  మనుషులకు మాత్రమే దేవుడు రెండు చేతులు ఇచ్చాడు.    మన అరచేతిలో ముక్కోటి దేవతలు నివాసం ఉంటారని...  అందుకే నిద్ర లేవగానే అరచేతిని మొదటగా చూడమని మన పెద్దలు చెప్పారు.. అదే శాస్త్రం కూడా చెబుతున్నది..