సీజన్ మారిన్పప్పుడల్లా కొంతమందిలో చర్మం రంగు మారుతూ ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో ఉండే .. వేడి మెలనిన్ ను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల చర్మం నల్లగా మారడంతో పాటు ముఖంపై మొటిమలు, మచ్చలు పెరుగుతాయి. కొంతమందికి వర్షం తడిస్తే చాలు.. స్కిన్ ఎలర్జీ వచ్చి మచ్చలు ఏర్పడుతాయి. అందుకే చర్మాన్ని తాజాగా ఉంచుకోవడానికి ఆయుర్వేదిక మూలికలను వాడటం మంచిది అవేంటో ఇప్పుడు చూద్దాం.
చందనం: దీనిని చర్మంపై రాసుకుంటే కూల్గా.. హాయిగా ఉంటుంది.దీని పాలల్లో కలిపి తాగడం వల్ల ఎండ నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతే కాకుండా చందనం పొడిని ఫేస్‌ప్యాక్‌లా కూడా వేసుకోవచ్చు. చర్మం జిడ్డుగా ఉంటే కాస్త చెందనం పొడిలో రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ముఖానికి రాసుకోవాలి. ఒక వేళ పొడి చర్మమైతే దానిని పచ్చిపాలతో కలిపాలి. ఇది మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది.
అలోవెరా:చర్మాన్ని వేడి.. చలి నుంచి ఉపశమనం పొందడానికి అలోవెరా చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. అలోవెరా చర్మాన్ని తేమగా మార్చడానికి సహాయపడుతుంది. అలోవెరాను రకరకాల ఉపయోగించవచ్చు . సీజన్ మారే సమయంలో వాతావరణంలో వచ్చే హెచ్చు ఉష్ణోగ్రతల వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడమే కాకుండా వెంట్రుకలు కూడా సూర్యరశ్మి తగిలి పొడిబారడం కనిపిస్తుంది. అయితే అటువంటి సమయంలో దీన్ని ఫేస్ ప్యాక్‌లాగా కూడా ఉపయోగించవచ్చు. ముఖం మెరుస్తూ ఉండటంతో పాటు మొటిమలు, మచ్చలు రాకుండా ఉంటాయి.
వేపాకు: వేప ఆకులను అప్పుడప్పుడు తింటే చాలా మేలు జరుగుతుంది. ఇవి శరీరంలోని టాక్సిన్ లను బయటకు పంపడంలో సహాయ పడతాయి. మొటిమలు, మచ్చలు లేని ముఖం కోసం దీనిని ఉపయోగించవచ్చు. కొందరు ఫేస్ ప్యాక్ లాగా కూడా వేపాకును తయారు చేసుకొని ఉపయోగిస్తారు. ఒక వేళ దీని వాసన నచ్చకపోతే ఎండు ఆకులను గ్రైండ్ చేసి ఉపయోగించవచ్చు. ఇది ముఖంపై మచ్చలు రాకుండా చేస్తుంది.
మంజిష్ట :మంజిష్ట శరీరం చల్లబడడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద మూలిక. ఇది శరీరం నుంచి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. మంజిష్ట పొడిని ముఖానికి తేనె కలిపి రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో ముడతల సమస్య కూడా దూరమవుతుంది. మచ్చలు రాకుండా ఉంటాయి.
బెయిల్ రసం: కొంతమందికి జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవి మొటిమలు లేదా చర్మ సమస్యలకు దారితీస్తాయి. మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల శరీరంలో వేడి పెరుగుతుంది. ముఖం మీద మొటిమలు రావడానికిది సాధారణ కారణాల్లో వేడి ఒకటి. అటువంటి పరిస్థితిలో బెయిల్ రసం తీసుకోవడం వల్ల పేగులలోని వేడిని తగ్గుతుంది. అంతే కాకుండా చర్యం కాంతి వంతంగా ఉంటుంది.