వాట్సాప్ కొత్త ఫీచర్ను అందుబాటులోకి తేనుంది. ఒకే ఫోన్లో రెండు సిమ్ లను ఎలాగైతే ఉపయోగిస్తామో..ఇక నుంచి ఒకే సిమ్లో రెండు వాట్సాప్ లను వినియోగించుకోవచ్చని మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. ఇందుకు రెండు సిమ్ కార్డులు ఫోన్లో వేసుకోవాలని సూచించారు.
ఇప్పటి వరకు ఒక ఫోన్ నెంబర్పై రెండో వాట్సాప్ ఖాతా ఓపెన్ చేయాలంటే ముందున్న వాట్సాప్ ఖాతా నుంచి లాగౌట్ కావాల్సి ఉండేది. కానీ వాట్సాప్ తీసుకొస్తున్న కొత్త ఫీచర్తో ఆ అవసరం లేదు. స్మార్ట్ ఫోన్లో రెండు సిమ్ కార్డుల ద్వారా రెండు వాట్సాప్ ఖాతాలను ఓపెన్ చేసుకోవచ్చని మార్క్ జుకర్ బర్గ్ తెలిపారు. అతి త్వరలో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు.
Also Read : పండక్కి ఊరెళ్తున్నారా..? అయితే.. జాగ్రత్త! చోరీల నివారణకు పోలీసుల సూచనలు ఇవే
ఒకే ఫోన్లో రెండు సిమ్ కార్డులతో రెండు వాట్సాప్ ను ఇలా ఓపెన్ చేయాలి
- మీ ఫోన్ లో వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత కుడివైపు పైభాగంలో మూడు చుక్కలను క్లిక్ చేయాలి..
- ఈ మూడు చుక్కలను క్లిక్ చేసిన తర్వాత అందులోని సెట్టింగ్స్ ఓపెన్ చేయాలి.
- అకౌంట్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత యాడ్ అకౌంట్ పై క్లిక్ చేయాలి.
- నిబంధనలను అనుసరించి రెండో వాట్సాప్ ఖాతా ఓపెన్ చేయబడుతుంది.
- కుడివైపున పై భాగంలో గల మూడు చుక్కలను క్లిక్ చేసి..కావాల్సినప్పుడల్లా రెండు ఖాతాలను స్విచ్ఛాన్, స్విచ్ఛాఫ్ చేసుకోవచ్చు.