Google.. ఎమోజి కిచెన్ అనే అద్భుతమైన కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇది Google శోధనలో మనకు కావాల్సిన ఎమోజీలను రూపొందించడానికి వీలు కల్పిస్తుంది. మొదట ఇది ఆండ్రాయిడ్ Gboardలో ప్రారంభించబడుతుంది. ఎమోజీ కిచెన్ ద్వారా రెండు ఎమోజీలను కలిపి ఓ ప్రత్యేకమైన స్టిక్కర్ గా మార్చొచ్చు. ఈ సరికొత్త ఫీచర్ వెబ్ లో అందుబాటులో ఉంది. ఐఫోన్లు, డెస్క్ టాప్, ఇతర అన్ని ఎక్విప్ మెంట్ల ద్వారా యాక్సెస్ చేయొచ్చు.
ఎమోజీ కిచెన్ ఫీచర్ ఎలా ఉపయోగించాలంటే..
1. Google లో Emoji Kitchen అని టైప్ చేసి సెర్చ్ చేయాలి.
2. Get Cooking Box పై క్లిక్ చేయాలి
3. ప్రత్యేక మాషప్ లను రూపొందించేందుకు ఎమోజీలను ఎంచుకోవాలి
4. ఉదాహరణకు మామిడి పండు తింటున్న కోతి ఎమోజీని సృష్టించాలంటే.. కోతి, మామిడి కాయ ఎమోజీలను తీసుకొని వాటిని విలీనం చేయాలి.
5. Emoji Kitchen నుంచి తయారు చేసిన ఎమోజీని కాపీ చేసుకోవచ్చు. తర్వాత కూడా దానికి మార్చుకునే అవకాశం ఉంది.
ఇలా ఎమోజీ కిచెన్ ఫీచర్ ద్వారా మనకు నచ్చిన ఎమోజీలను తయారి చేసివినియోగించుకోవచ్చు.