సెన్సర్ లైట్
రాత్రి నిద్రలో లేచి వాష్‌రూమ్‌కి వెళ్లినప్పుడు లైట్ ఆన్ చేస్తారు. కానీ వాష్‌రూమ్ నుంచి బయటికి వచ్చాక నిద్ర మత్తులో లైట్ ఆపేయడం మర్చిపోతుంటారు. అలాంటివాళ్ల కోసమే మార్కెట్‌లోకి సెన్సర్ లైట్లు వచ్చాయి. ఈ లైట్లను ఆన్, ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులో ఉండే మోషన్ సెన్సర్ మనిషి లోపలికి వెళ్లగానే పసిగట్టి లైట్ ఆన్ చేస్తుంది. బయటికి రాగానే ఆఫ్ చేస్తుంది. పానసోనిక్, హాల్‌నిక్స్.. లాంటి చాలా కంపెనీలు ఇలాంటి లైట్స్ మార్కెట్‌లోకి తెచ్చాయి. పానసోనిక్ లైట్ (ఇన్‌గ్రెస్ ప్రొటెక్షన్) ఐపీ20 రేటింగ్‌తో వస్తుంది. బల్బ్ లోపల మోషన్ సెన్సర్ ఉంటుంది. ఇది బల్బ్ చుట్టూ మూడు మీటర్ల దూరంలో కదలికను గుర్తించగలదు. అంటే ఆరు మీటర్ల వ్యాసంతో మనుషులను గుర్తిస్తుంది. వోల్టేజీ స్పైక్‌లు, 3.5 కేవీ వరకు సర్జ్ ప్రొటెక్షన్ ఉంటుంది.
ధర : 199 రూపాయలు
హ్యాండ్ డ్రయ్యర్
చేతులు కడిగిన ప్రతిసారి టవల్‌తో తడి తుడుస్తుంటారు. అయినా.. చేతులు పూర్తిగా ఆరిపోవు. అలాంటప్పుడు ఈ హ్యాండ్ డ్రయ్యర్‌ని వాడితే సరిపోతుంది. దీన్ని వాష్‌రూం డోర్ దగ్గర ఇన్‌స్టాల్ చేసుకుంటే చేతులు కడిగిన ప్రతిసారి తుడిచే పనిలేకుండా డ్రై చేసుకోవచ్చు. ఎలక్రేంజ్ అనే కంపెనీ తెచ్చిన ఈ డ్రయ్యర్‌ని గోడకు ఈజీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇది1800వాట్స్ పవర్‌తో పనిచేస్తుంది. కాబట్టి సెకన్లలోనే చేతులు ఆరిపోతాయి. సౌండ్ కూడా అంతగా ఉండదు. ప్రతిసారి బటన్ నొక్కి ఆన్ చేయాల్సిన అవసరం లేదు. డ్రయ్యర్ కింద చేతులు పెట్టగానే ఆన్ అవుతుంది. తీసేస్తే ఆఫ్ అయిపోతుంది.
ధర : 2,399 రూపాయలు
క్లీనింగ్ బ్రష్
వాష్‌రూమ్ క్లీన్ చేయడమంటేనే చాలా శ్రమతో కూడిన పని. బ్రష్ పట్టుకుని వాల్ టైల్స్‌తో యుద్ధం చేయాల్సిందే. కానీ.. ఈ ఎలక్ట్రిక్ క్లీనింగ్ బ్రష్‌ని పట్టుకుంటే చాలు... అదే చకచకా శుభ్రం చేసేస్తుంది. దీన్ని క్యాట్స్ బేపీజీ అనే కంపెనీ మార్కెట్‌లోకి తెచ్చింది. బటన్ క్లిక్ చేస్తే బ్రష్ స్క్రబ్బర్ 360 డిగ్రీలు తిరుగుతుంది. దీంతోపాటు మూడు బ్రష్ హెడ్‌లు వస్తాయి. నైలాన్ బ్రష్ హెడ్ ఎక్కువ జిడ్డుగా ఉన్న టైల్స్‌ని క్లీన్ చేస్తుంది. సీ బ్రొకేడ్ బ్రష్ హెడ్‌ని వస్తువులను క్లీన్ చేయడానికి వాడొచ్చు. టైల్స్‌ని వాష్ చేశాక చిన్న చిన్న పార్టికల్స్ ఏవైనా మిగిలిపోతే లాంబ్ వూల్ బ్రష్ హెడ్‌తో క్లీన్ చేసేయొచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ కార్డ్‌లెస్ బ్రష్‌లో1500 mAh లిథియం బ్యాటరీ ఉంటుంది. యూఎస్‌బీ ఇంటర్‌ఫేస్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీ ఒకసారి ఫుల్‌గా ఛార్జింగ్ చేస్తే 120 నిమిషాల పాటు వాడుకోవచ్చు. టైల్స్‌తో పాటు సింక్, టాయిలెట్, బాత్‌టబ్, డోర్ స్లాట్‌లను కూడా క్లీన్ చేసేయొచ్చు.
ధర : 370 రూపాయలు
స్టోరేజ్ క్యాబినెట్
కొన్ని ఇళ్లలో కామన్ బాత్‌రూమ్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న వాళ్లు వాడే సోప్, షాంపూ, టూత్ బ్రష్, పేస్ట్‌లు వంటివన్నీ ఒకే షెల్ఫ్‌లో పెడతారు. స్నానం చేసేటప్పుడు వాటి మీద నీళ్లు పడుతుంటాయి. తరువాత వాళ్లు బాత్రూమ్కి వెళ్లినప్పుడు వాళ్లు వాడాల్సిన వస్తువుల మీద తడి ఉండి వాడాలంటే చిరాకుగా అనిపిస్తుంది. ఇలాంటి క్యాబినెట్‌ని కామన్ బాత్‌రూమ్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే తడి చిరాకు లేకుండా ఉంటుంది. హ్యాప్పర్ స్టోర్ అనే కంపెనీ ఈ క్యాబినెట్‌ని మార్కెట్‌లోకి తెచ్చింది. దీన్ని బాత్‌రూంలో పెట్టుకుంటే సోప్, షాంపూ, టూత్ బ్రష్, పేస్ట్‌ల మీద నీళ్లు పడవు. ఎక్కువ స్టోరేజీ కెపాసిటీ ఉండడం వల్ల అన్ని వస్తువులను ఆర్గనైజ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. మౌంట్ స్క్రూలతో ఎలాంటి గోడకైనా దీన్ని పెట్టేయొచ్చు. దీన్ని బాత్‌రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా అద్దం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్యాబినెట్ డోర్‌కి మిర్రర్ కూడా ఉంటుంది. హై క్వాలిటీ ప్లాస్టిక్‌తో దీన్ని తయారు చేశారు. కాబట్టి నీళ్లు పడినా పాడుకాదు.
ధర : 999 రూపాయలు
నిర్వహణ: సగన్