X (ట్విట్టర్)లో ఆడియో, వీడియో కాల్స్ : ఎలా అప్ డేట్ చేసుకోవాలంటే..

X (ట్విట్టర్) యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై మీరు X (ట్విట్టర్) లో కూడా ఆడియో, వీడియో కాల్స్ ఎంజాయ్ చేయొచ్చు. ట్విట్టర్ ను కొనుగోలు చేసిన కొన్ని నెలల తర్వాత ఎలాన్ మస్క్ యూజర్లకు ఆడియో, వీడియో కాల్స్ ఆప్షన్స్ ను పరిచయం చేస్తున్నారు. అయితే ఇది ప్రస్తుతం బ్లూటిక్ మార్క్ సబ్ స్ర్కైబర్లు ఉన్న వారికి మాత్రమే ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. దీనిని iOS మొబైల్స్ లో  సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లకు త్వరలో అందుబాటులోకి వస్తుందని ఎలాన్ మస్క్ ప్రకటించారు. వినియోగదారులకు మరిన్ని సేవలను అందించే లక్ష్యంతో ఈ ఫీచర్ ను అందుబాటులో తెచ్చామని ఎలాన్ మస్క్ తెలిపారు. 

ఈ ఫీచర్ ను వినియోగించే యూజర్లకు మరో ఆప్షన్ కూడా ఇచ్చారు.  అదేంటంటే.. మీరు ఎవరికైతే కాల్స్ చేయాలనుకుంటారో ఎంచుకునేందుకు అవకాశం ఉంది. డీఫాల్ట్ గా అయితే కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న అన్ని ఫోన్ నంబర్లనుంచి  ఆడియో, వీడియో కాల్స్ చేయొచ్చు.. రీసీవ్ చేసుకోవచ్చు.. కానీ ఇక్కడ ప్రత్యేకంగా కాల్స్ చేయాల్సిన కాంటాక్ట్ నెంబర్లను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. డైరెక్ట్ మేసేజింగ్ సెట్టింగ్ సర్దుబాటు చేయడం ద్వారా మీ కాల్స్ లిస్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఓ కండిషన్ ఏంటంటే.. రెండు పార్టీలు కనీసం ఒకసారైన డైరెక్ట్ మేసేజ్ లు పంచుకొని ఉండాలి. 

ఆడియో, వీడియో కాల్స్ ను పరిమితం ఇలా చేయొచ్చు..

1.ట్విట్టర్ ను ఓపెన్ చేసి డైరెక్ట్ మేసేజ్ ను నావిగేట్ చేయాలి. 

2.కుడివైపు పై భాగాన సెట్టింగ్ ఐకాన్ ఉంటుంది.. దానిని ట్యాప్ చేయడం ద్వారా settingsలు యాక్సెస్ చేయొచ్చు. 

3.Settings లో People in your address book,People you follow, Verified users ఆప్షన్లను ఎంచుకోవడం ద్వారా మీకు కాల్స్ చేసేవారి లిస్ట్ ను పరిమితం చేయొచ్చు.

X లో కాల్‌ను ఎలా ప్రారంభించాలి?

1. X (ట్విట్టర్) లో కి వెళ్లి  direct messages ఓపెన్ చేయాలి. 

2.ఇప్పటికే ఉన్న  DM conversation ఎంచుకోవాలి లేదా కొత్తది ప్రారంభించండి.

3.ఫోన్ఐకాన్ పై నొక్కండి. Audio call' or 'Video call' నొక్కి  ఆడియో,  వీడియో కాల్స్ చేయొచ్చు.