Gold Tip : మీ బంగారం నగలను.. ఇంట్లోనే ఇలా శుభ్రం చేసుకోండి.. లేకపోతే నల్లగా మారిపోతాయ్..!

Gold Tip : మీ బంగారం నగలను.. ఇంట్లోనే ఇలా శుభ్రం చేసుకోండి.. లేకపోతే నల్లగా మారిపోతాయ్..!

నగలు పాడవకుండా.. మెరుగు పోకుండా చూసుకోవాలి.. లేకపోతే ఏ మాత్రం అశ్రద్ధ చేసినా నగ మెరుపుతోపాటు వాటి విలువ కూడా తగ్గుతుంది. కాబట్టి నగల విషయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి.

>>> అలంకరణ మొత్తంలో ధరించే చివరిది.. తొలగించే వాటిలో మొదటిది మీ నగ అయి ఉండాలి.
>>>  అలసిపోయే పనులు చేసే సమయంలో నగలు ధరించకపోవటమే ఉత్తమం. చెమట, చర్మం మీద ఉండే సహజ సిద్ధమైన నూనెలు.. నగల మెరుపును పోగొడతాయి. 
>>> నగలను క్రమం తప్పక శుభ్రం చేస్తూ ఉండాలి. ఇందుకోసం ఒక వంతు మైల్డ్ క్లీనర్‌‌కు రెండొంతుల నీళ్లు కలిపి, దాన్లో మెత్తని టూత్ బ్రష్ ముంచి నగలను రుద్దాలి. 
>>> నురగొచ్చేలా నగల్ని రుద్దకూడదు. ఇలా చేస్తే సబ్బు గొలుసుల్లో.. పొదిగిన రాళ్ల అడుగున పేరుకుంటుంది.

>>> రాళ్లు వదులయ్యాయేమో చూసుకుంటూ.. రాళ్లను పట్టి ఉంచే తొడిమలు విరిగిపోయాయేమో గమనించుకుంటూ.. నగలను ఎప్పటికప్పుడు సరి చేయించుకుంటూ ఉండాలి.
>>> చల్లని నీళ్లు, చల్లని వాతావరణంలో ఉంగరాలు ధరించకపోవటమే మేలు. చల్లని వాతావరణానికి చేతి వేళ్లు కుంచించుకుపోతాయి. దాంతో వేలికున్న ఉంగరాలు వదులై జారి పడిపోయే ప్రమాదం ఉంది.

మీ నగల విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇంట్లోనే మీ నగలను శుభ్రం చేసుకోవచ్చు. 

=== V6 వెలుగు లైఫ్

ALSO READ | Winter Health : ఇంట్లోకి చలిగాలి రాకుండా.. వెచ్చదనం కోసం ఈ జాగ్రత్తలు తీసుకోండి..!