అభిమానులారా! వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని తలచుకొని బాధపడటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు.. గతం గతః.. ఆ జ్ఞాపకాలు మరిచిపోండి.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. గురువారం (నవంబర్ 23) సూర్య సారథ్యంలోని భారత యువ జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్ గురుంచి ఆలోచించండి. ఫ్రీగా ఎక్కడ చూడాలో తెలుసుకొని.. టీ20 మాజాని ఆస్వాదించండి.
మిషన్ 2024
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. సీనియర్లను పక్కన పెట్టి కుర్రాళ్లకు అవకాశమిచ్చింది. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, ముఖేష్ కుమార్.. ఇలా జట్టు నిండా అందరూ కుర్రాళ్లే. ఈ యంగ్ గన్స్.. వరల్డ్ కప్ విన్నర్స్‌కు ఎంత వరకు పోటీ ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది. హార్దిక్ పాండ్యా గాయపడటంతో ఈ సిరీస్‌కు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
హాట్ స్టార్ కాదు..
ఇండియా- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ ను టీవీలో స్పోర్ట్స్ 18, కలర్స్ సినీ ప్లెక్స్ లలో ప్రత్యక్ష ప్రసారాలు చూడవచ్చు. ఇక డిజిటల్ ప్లాట్‌ఫామ్ లో అయితే జియో సినిమా యాప్ లో చూడవచ్చు. మ్యాచ్ సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. అస్సలు మిస్సవకండి.
షెడ్యూల్
- రెండో టీ20(నవంబర్ 26): గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం (తిరువనంతపురం)
- మూడో టీ20(నవంబర్ 28): బర్సపార స్టేడియం (గువాహటి)
- నాలుగో టీ20(డిసెంబర్ 1): షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం(రాయ్‌పూర్)
- ఐదో టీ20(డిసెంబర్ 3): చిన్నస్వామి స్టేడియం (బెంగళూరు)