యూపీఐతో ఏటీఎంలో డబ్బు విత్​డ్రా ఇలా...

యూపీఐతో ఏటీఎంలో డబ్బు విత్​డ్రా ఇలా...

 దేశంలో ఇప్పుడు యూపీఐ తెలీనివారుండరంటే  అతిశయోక్తి కాదు. తాజాగా యూపీఐ మరో కొత్త ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చింది. అదేమిటంటే  డెబిట్​ కార్డు అవసరం లేకుండా యూపీఐ ద్వారానే మనం ఏటీఎంలలో డబ్బు విత్​డ్రా చేసుకోవడం. ఈ ఫెసిలిటీని గ్లోబల్​ ఫిన్​టెక్​ ఫెస్ట్ సందర్భంగా ముంబైలో లాంచ్‌‌‌‌​ చేశారు. కొత్త సదుపాయాన్ని చూసిన ఇంటర్​నెట్​ యూజర్లు ఇదొక గేమ్​ఛేంజర్​ అవుతుందని మెచ్చుకుంటున్నారు. 

యూపీఐ ద్వారా ఏటీఎంలో డబ్బు ఎలా విత్​డ్రా చేసుకోవాలో వివరించే వీడియోను కేంద్ర మంత్రి పీయూష్​ గోయెల్ తన ట్విటర్​ హ్యాండిల్​లో పోస్ట్​ చేశారు. ఫిన్​టెక్ ఇన్​ఫ్లూయెన్సర్​రవిసుతాంజని ఈ వీడియో చేశారు. ఏటీఎంలో డబ్బు ఎంత ఈజీగా విత్​డ్రా చేయొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. స్క్రీన్​మీద కనిపించే కార్డ్​లెస్​ క్యాష్​ ఆప్షన్​ను ముందుగా ఎంచుకోవాలి. మనకి ఎంత అమౌంట్​ కావాలని అప్పుడు అడుగుతుంది.

 అమౌంట్​ ఎంతో ఎంటర్ చేశాక, ఒక క్యూఆర్​ కోడ్​ ఏటీఎం స్క్రీన్​పై  మనకి కనిపిస్తుంది. ఆ క్యూఆర్​ కోడ్​ను భీమ్ ​యాప్​తో  స్కాన్​ చేసి, ఆ తర్వాత పిన్​ నెంబర్​ ఎంటర్​ చేయాలి. వెంటనే మనకి ఏటీఎం నుంచి క్యాష్​ వస్తుంది.