PAN Card Number: పాన్ కార్డు నంబర్లో ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య ఉంటుంది ఎందుకు..? తప్పనిసరిగా తెలుసుకోవాల్సి విషయం

PAN Card Number: పాన్ కార్డు నంబర్లో ఆల్ఫాన్యూమరిక్ సంఖ్య ఉంటుంది ఎందుకు..? తప్పనిసరిగా తెలుసుకోవాల్సి విషయం

పాన్ కార్డు..పర్మినెంట్ అకౌంట్ నంబర్(PAN)..ఇన్ కంటాక్స్ డిపార్టుమెంట్ జారీ చేసే అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. పాన్ కార్డును ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో వివిధ రకాల ప్రయోజనాలను పొందేందుకు గుర్తింపు కోసం వినియోగిస్తుంటాం. ఇందులో కార్డు హోల్డరుకు సంబంధించిన అన్ని డిటెయిల్స్ ఉంటాయి. ఇందులో పాన్ నంబర్ కు చాలా విలువైనది. అయితే పాన్ నంబర్ ఎందుకు అలా ఇంగ్లీషు అక్షరాలు, నంబర్లతో ప్రత్యేకంగా ఉంటుందో మనం ఎప్పుడు కూడా గమనించి ఉండకపోవచ్చు. పాన్ కార్డు నంబర్ ప్రత్యేకంగా ఎందుకు ఉంటుందో.. కార్డులోని ప్రతి అక్షరం ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది..వాటిలో కార్డు హోల్డరుకు సంబం ధించిన ఏం సమాచారం ఉంటుందో తెలుసుకుందాం.

పాన్ కార్డులో అత్యంత ముఖ్యమైనది కార్డు హోల్డర్ పేరు. ఒక వ్యక్తి విషయంలో అది వ్యక్తి పేరు. కంపెనీ విషయంలో కంపెనీ రిజిస్టర్డ్ పేరు, పార్టినర్ షిప్  విషయంలో సంస్థ పేరుగా ఇది పరిగణించబడుతుంది. తర్వాత తండ్రి పేరు ఉంటుంది. ఇది  కూడా కీలకం. తండ్రికి బదులుగా తల్లి పేరు కూడా రాస్తారు. తండ్రి పేరు కింద పుట్టిన తేది ఉంటుంది. ఇది కార్డు హోల్డర్ పుట్టిన తేది ధృవీకరణను తెలియజేస్తుంది.

Also Read :- జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషన్ ఇచ్చి 600 రోజులైనా..ఫలితాలు విడుదల చేయలేదు

పర్మినెంట్ అకౌంట్ నంబర్ అంటే.. 

పాన్ కార్డు నంబర్.. ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తుంది. ఇది వ్యక్తి అందించిన వివరాలపై ఆధారంగా ప్రొవైడ్ చేయబడుతుంది. PAN లో 10 ఆల్పాబెట్, నంబర్లను కలిగి ఉంటుంది. ఇందులో ప్రతి అక్షరం సమాచారాన్ని సూచిస్తుంది. 

పాన్ నంబర్లతోని మొదటి మూడు అక్షరాలు ఆల్ఫాబెట్స్.. ఇవి A, B, C,F, G, H, L, J, P, T లలో ఏవైనా మూడు ఉండొచ్చు. 

ఇందులో 
A-: Association of Persons (AOP)
B: Body of Individuals (BOI)
C: Company
F: Firm
G: Government Agency
H: Hindu Undivided Family (HUF)
L: Local Authority
J:  Artificial Juridical Person
P: Individual
T: Association of Persons for Trust లను సూచిస్తాయి. 

ఇక నాలుగో లెటర్.. కూడా ఆల్ఫాబెట్..టాక్స్ పేయర్ కేటగిరిని సూచిస్తుంది. 

ఐదో లెటర్.. ఇది కార్డుహోల్డర్ ఇంటిపేరులోని మొదటి అక్షరం. వ్యక్తికి సంబంధించి కాకుండా పాన్ కార్డు హోల్డర్ పేరులోని మొదటి అక్షరం అవుతుంది. ఇక తర్వాత వచ్చే నాలుగు నంబర్లు..పాన్ కార్డు జారీలో మీకిచ్చే నంబర్లు.. అవి 0001 నుంచి 9999 మధ్య  ఉంటాయి. 

కార్డుహోల్డర్ సంతకం.. పాన్ కార్డులో ఇది చివరగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీల్లో సిగ్నేచర్ ఫ్రూప్ కింద పాన్ కార్డును ఉపయోగించవచ్చు. ఇక ఫొటోగ్రాఫ్ గురించి వ్యక్తి గుర్తింపును సూచిస్తుంది. ఇది పాన్ కార్డులో కుడి పక్కల కింది భాగంలో ఉంటుంది.