ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు జనవరి 11న హైమన్ డార్ఫ్ దంపతుల వర్థంతిని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున ఆదివాసీలు తరలివచ్చి హైమన్ డార్ఫ్ దంపతుల 36 వ వర్థంతి సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జిల్లా జైనూర్ లో బుధవారం (జనవరి1,2025) పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇంతకీ ఎవరీ హైమన్ డార్ఫ్ దంపతులు..ఎందుకు ఆదివాసీలు వీరి జయంతి, వర్థంతిలను ఘనంగా నిర్వహిస్తున్నారు.. ఏటా వీరిని ఎందుకు స్మరించుకుం టున్నారు.? నాగోబా జాతరకు, ఈ హైమన్ డార్ఫ్ దంపతులు సంబంధం ఏంటీ..? నాగో బా జాతర దర్బార్ కు ఉన్న అనుబంధం ఎలాంటిది?
హైమన్ డార్ఫ్ దంపతులు ఆస్ట్రియా దేశానికి చెందిన వారు.. లండన్ విశ్వ విద్యాలయంలో మానవ పరిణామ శాస్త్రలో డాక్టరేట్ పట్టా పొందినవారు. నేపాల్, పిలిప్ఫీన్స్, భారత్ వంటి దేశాల్లో ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం చేసిన గొప్ప మానవతా వాదులు.
ఆదిలాబాద్ ఆదివాసీలకు.. హైమన్ డార్ఫ్ దంపతులకు లింకేంటీ..
భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు తెలంగాణలోని ఓ ప్రాంతమై ఆదిలాబాద్ జిల్లా నిజాం పాలనలో ఉండేది..ఆదివాసీలు నివసిస్తున్న తండాలు, గూడేలకు, గ్రామాలకు కనీస సౌకర్యాలు లేకుండా ఉండేవి.
ఆదివాసీలు అనేక ఇబ్బందులు పడుతున్న రోజులవి..మరోవైపు స్వాతంత్ర్య పోరాటం జోరుగా సాగుతున్న రోజులవి.. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లా వాసీ..ఆదివాసీ బిడ్డ, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డికొమురయ్య పోరాటం మొదలు పెట్టి తొలి అమరుడయ్యారు.
ఆ క్రమంలో నిజాం గుండెల్లో వణుకు పుట్టింది.. ఆదివాసీల సమస్యలపై దృష్టి సారించిన నిజాం.. ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం చేసేందుకు హైమన్ డార్ఫ్ దంపతుల ఆదిలాబాద్ ఆదివాసీలు నివసించే ప్రాంతానికి పంపించారు.
నాగోబా జాతరకు,దర్బార్ కు.. హైమన్ డార్ఫ్ దంపతులకు మధ్య అనుబంధం
ఆదివాసీల జీవన విధానంపై అధ్యయనం చేస్తున్న హైమన్ డార్ఫ్ దంపతులను నాగోబా జాతర బాగా ఆకర్షించింది.. భారత దేశ వ్యాప్తంగా ఉన్న ఆదివాసీలు నాగోబా జాతరకు రావడం,.. మహాసమ్మేళనంగా పాల్గొనడం, ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలను బాగా ఆకట్టుకున్నాయి. అదే సమయంలో ఆదివాసీల సమస్యలపై నా దృష్టి పెట్టారు హైమన్ డార్ఫ్ దంపతులు.
నాగో బా జాతర సందర్భంగా గుమికూడిన ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు జాతర చివరి రోజున వారితో సమావేశం నిర్వహించేవారు..అదే దర్బార్.. ఈ దర్బార్ లో ఆదివాసీలను సమస్యలను తెలుసుకొని నిజాం ప్రభువుకు అందించేవారు.
అప్పటినుంచి ఆదివాసీల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన దేవునిగా చూసేవారు ఆదివాసీలు.. ప్రతియేటా వారి జయంతి, వర్థంతిలను నిర్వహిస్తుంటారు. ఈ యేడాది కూడా జనవరి 11న హైమర్ డార్ఫ్ దంపతుల వర్థంతిని నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశారు ఆదివాసీలు.