సిగరెట్ వల్లే.. ఫలూక్నుమా రైల్లో మంటలు వచ్చాయా?!

సిగరెట్ వల్లే.. ఫలూక్నుమా రైల్లో మంటలు వచ్చాయా?!

పశ్చిమ బెంగాల్ హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న  ఫలుక్ నుమా ఎక్స్ ప్రెస్ లో అగ్ని ప్రమాదం జరిగింది. మూడు బోగీలు పూర్తిగా కాలి బూడిద అయ్యాయి. ఎస్ 4, ఎస్5, ఎస్ 6 రిజర్వేషన్ బోగీల్లో మంటలు చెలరేగి.. కాలిపోయాయి. ప్రస్తుతం రైలు తెలంగాణలోని యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం బొమ్మాయిపల్లి దగ్గర నిలిచిపోయింది. 2023, జులై 7వ తేదీ ఉదయం జరిగింది ఈ ప్రమాదం.  రైలులో మంటలకు కారణం ఏంటీ.. రైలులోని ప్రయణికులు ఏమంటున్నారు అనేది.. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇలా ఉంది.

ఎస్ 4 బోగీలోని టాయ్ లెట్ దగ్గర.. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కరెంట్ ఫ్లెగ్ దగ్గర.. ఓ వ్యక్తి నిల్చుని సిగరెట్ తాగుతున్నాడంట.. సిగరెట్ నిప్పు రవ్వులు ఛార్జింజ్ పాయింట్ పై పడి.. కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయినట్లు చెబుతున్నారు ప్రత్యక్ష సాక్షులు. షార్ట్ సర్క్యూట్ అయిన వెంటనే పొగలు రావటంతో.. బోగీలోని కొందరు ప్రయాణికులు చైన్ లాగి రైలును ఆపేశారు. ఆ వెంటనే ప్రయాణికులు అందరూ కిందకు దిగేశారు. 

ALSO READ :Falaknuma express :మంటల్లో మూడు బోగీలు..భయానక వాతావరణం

ప్రయాణికులు కిందకు దిగిన వెంటనే.. మంటలు పెద్ద ఎత్తున చెలరేగాయి. ఉదయం 11 గంటల సమయంలో ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు ప్రయాణికులు. ఫలుక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో మంటలు, ప్రమాదానికి కారణాలపై రైల్వే అధికారులు ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. విచారణ తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు చెబుతున్న సమాచారం ఆధారంగా.. ఓ ప్రయాణికుడు సిగరెట్ తాగటం వల్లే ప్రమాదం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. విషయం తెలిసిన వెంటనే.. సికింద్రాబాద్ నుంచి రైల్వే అధికారులు పెద్ద సంఖ్యలో స్పాట్ కు చేరుకుంటున్నారు.