HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్

HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్

భారత ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) 234 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఖాళీల భర్తీకి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. మూడేళ్ల డిప్లమా విభాగంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ , కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఫిబ్రవరి 14, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 234

విభాగాల వారీగా ఖాళీలు:

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (మెకానికల్): 130
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్): 65
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్‌స్ట్రుమెంటేషన్): 37
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ (కెమికల్): 2

విద్యార్హతలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & కంట్రోల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ ఇంజినీరింగ్ విభాగాల్లో మూడేళ్ల డిప్లమా పూర్తి చేసిన వారు అర్హులు. UR/ OBCNC/ EWS అభ్యర్థులు 65 శాతం, SC/ ST/ PwBD అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించి ఉండాలి.

వయో పరిమితి: 14/ 02/ 2025 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనలు ప్రకారం SC/ ST/ OBC/ PWD అభ్యర్థులకు వయసులో సడలింపు కలదు.

అప్లికేషన్ ఫీజు: UR/ OBC/ EWS అభ్యర్థులు 1180/- దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. SC, ST & PwBD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు. 

దరఖాస్తు చేయు విధానం: ఆన్ లైన్.. (www.hindustanpetroleum.com)

జీతభత్యాలు: ప్రొబేషన్- ఎంపికైన అభ్యర్థులు చేరిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు ప్రొబేషన్‌లో ఉంటారు. దానిని విజయవంతంగా పూర్తి చేసిన వారు కంపెనీ నియమాల ప్రకారం ఆఫీసర్ గా నిర్ణయించబడతారు. పే స్కేల్‌ రూ. 30వేల నుండి లక్షా వేల మధ్య ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), గ్రూప్ టాస్క్/ గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

  • దరఖాస్తులు ప్రారంభ తేదీ: 15/ 01/ 2025
  • దరఖాస్తులకు చివరి తేదీ: 14/ 02/ 2025 

నోటిఫికేషన్ కోసం HPCL Recruitment 2025 ఇక్కడ క్లిక్ చేయండి.