మార్కెట్లోకి డీఈఎఫ్​డీజిల్.. తయారు చేసిన హెచ్​పీసీఎల్, టాటా మోటార్స్

మార్కెట్లోకి డీఈఎఫ్​డీజిల్.. తయారు చేసిన హెచ్​పీసీఎల్, టాటా మోటార్స్

ముంబై: హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్​పీసీఎల్), టాటా మోటార్స్ బుధవారం కో-బ్రాండెడ్ డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ 'జెన్యూన్ డీఈఎఫ్​'ను ప్రారంభించాయి. ఇది  23 వేల హెచ్​పీసీఎల్​ పెట్రోల్​ బంకుల్లో అందుబాటులో ఉంటుంది. ఇది వెహికల్​ కెపాసిటీని పెంచుతుందని, ఎక్కువ కాలం మన్నుతుందని హెచ్​పీసీఎల్ తెలిపింది.

డీఈఎఫ్​ బీఎస్​–6- డీజిల్​ అని, హానికర నైట్రోజన్ ఆక్సైడ్‌‌లను నైట్రోజన్, నీరుగా మారుస్తుందని పేర్కొంది. దీనివల్ల హానికర వాయువులు తగ్గుతాయని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మార్కెటింగ్ డైరెక్టర్ అమిత్ గార్గ్ అన్నారు. మార్కెట్లోకి వస్తున్న నకిలీ బ్రాండ్‌‌ల గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రతిరోజూ రెండు కోట్ల మంది తమ ఔట్​లెట్లకు వస్తున్నారని ప్రకటించారు. టాటా మోటార్స్​సీనియర్​ ఎగ్జిక్యూటివ్​గిరీశ్​వాఘ్ ​మాట్లాడుతూ రెండువేలకుపైగా టాటా మోటార్స్ ఔట్​లెట్లు, పది వేలకుపైగా మల్టీ బ్రాండ్ రిటైల్ ఔట్‌‌లెట్లలో  డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ అందుబాటులో ఉంటుందని అన్నారు.