హెచ్ పీఎస్ విద్యార్థినికి‘ఎట్ హోమ్’ కు ఆహ్వానం

హెచ్ పీఎస్ విద్యార్థినికి‘ఎట్ హోమ్’ కు ఆహ్వానం

పద్మారావునగర్​, వెలుగు: స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా రాష్ర్టపతి భవన్​లో నిర్వహించే ‘ ఎట్ హోమ్’ కు బేగంపేట హైదరాబాద్​పబ్లిక్​స్కూల్​విద్యార్థిని ఆకర్షణ(12)కు ఆహ్వానం అందింది. రాష్ర్టపతి ద్రౌపతి ముర్ము నుంచి సోమవారం విద్యార్థినికి ఇన్విటేషన్​అందినట్లు తండ్రి సతీశ్​తెలిపారు. దేశవ్యాప్తంగా 20 మంది పాల్గొనే ఎట్​హోమ్​లో  తెలంగాణ నుంచి విద్యార్థిని ఆకర్షణ ఎంపిక కావడం గమనార్హం. ప్రస్తుతం ఆకర్షణ 8వ క్లాస్ చదువుతుంది.

కొంతకాలంగా విద్యార్థిని స్కూళ్లు, అనాథాశ్రమాల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తుంది. ఇప్పటివరకు15 లైబ్రరీలను ప్రారంభించింది. త్వరలో మెట్రో స్టేషన్లలోనూ ఏర్పాటుకు సంస్థ నిర్వాహకులతో అగ్రిమెంట్ కూడా జరిగింది. ఇటీవల ప్రధాని మోదీ కూడా విద్యార్థిని పిలిపించుకుని అభినందించారు. 25వ లైబ్రరీ ఓపెనింగ్ కు వస్తానని ప్రధాని హామీ ఇచ్చారు.  ఇన్విటేషన్​ అందడం ఆనందంగా ఉందని.. భవిష్యత్​ లో మరిన్ని లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు ఇలాంటి ప్రోత్సాహాలు ఎంతో దోహదం చేస్తాయని విద్యార్థిని పేర్కొన్నారు.