
ఎన్టీఆర్ ఎంత టాలెంటెడ్ డ్యాన్సర్ అనేది ‘నాటు నాటు’ పాటతో ప్రపంచమంతా చూసింది. అలాగే హృతిక్ రోషన్ డ్యాన్సుల సంగతి సరేసరి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో డ్యాన్స్ నెంబర్ వస్తే కచ్చితంగా అది వండర్స్ క్రియేట్ చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు అలాంటి ఓ మాస్ సాంగ్‌ను ‘వార్ 2’ చిత్రం కోసం ముంబైలో చిత్రీకరిస్తున్నారు. ముంబైలోని యష్‌రాజ్ స్టూడియోలో 500 మందికి పైగా డ్యాన్సర్స్‌తో ఆరు రోజులపాటు ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోందని సమాచారం.
ప్రీతమ్ ఈ పాటను కంపోజ్ చేయగా, బాస్కో మార్టీస్ కొరియోగ్రఫీలో దీన్ని చిత్రీకరిస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ కంప్లీట్ కాగా, ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఆగస్టు 14న సినిమాను విడుదల చేయనున్నారు. యశ్‌రాజ్ సంస్థ గతంలో నిర్మించిన ‘వార్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభమైంది. త్వరలో ఎన్టీఆర్ షూట్‌లో జాయిన్ అవబోతున్నాడు. ఇండియన్ సినిమాల్లో ఇప్పటివరకూ చూడని యూనిక్ స్క్రిప్ట్‌తో ఈ చిత్రం వస్తోందని, ఆకాశమే హద్దుగా ఎవరూ ఊహించని స్థాయి వసూళ్లు రాబడుతుందని ఇటీవల నిర్మాత మైత్రి రవిశంకర్ తెలిపారు.