
జూనియర్ ఎన్టీఆర్ (NTR) నటిస్తున్న బాలీవుడ్ డెబ్యూ మూవీ 'వార్ 2'(WAR 2). బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా నటించిన వార్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ సినిమాను దర్శకుడు అయాన్ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్నాడు.
లేటెస్ట్గా వార్ 2 మూవీ సెట్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లపై సాంగ్ షూట్ జరగనుంది. నేడు (మార్చి 4న) అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోస్‌లో వార్2లో వచ్చే ఓ ఎపిక్ డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్ చిత్రీకరణను ప్రారంభించనున్నారు మేకర్స్.
ఇందులో 500 మందికి పైగా డ్యాన్సర్లు ఈ అద్భుతమైన నృత్య యుద్ధంలో పాల్గొంటారు. ఆరు రోజుల పాటు భారీ స్థాయిలో ఈ ఎపిక్ డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్ను షూట్ చేయటకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇది క్లైమాక్స్ ఫైట్ సెట్-పీస్‌లోకి వెళ్ళే ఒక అద్భుతమైన డ్యాన్స్ యుద్ధంని మేకర్స్ చెబుతున్నారు.
అయితే, ప్రీతమ్ మ్యూజికల్‌లో రానున్న ఈ సాంగ్ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్‌ను నిర్మించారని, ప్రీతమ్ చాలా ఫాస్ట్ బీట్తో సాగే పాటను కంపోజ్ చేశారని బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి.
ఈ డ్యాన్స్-ఆఫ్ ఆలోచన నిర్మాత ఆదిత్య చోప్రా నుండి వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ ఇద్దరు స్టార్ హీరోలతో ఒకరిపై ఒకరు పోటీగా చేసే ఈ డ్యాన్స్ నంబర్ సినిమాకే హైలైట్‌గా ఉంటుందని సినీ వర్గాలు వెల్లడించాయి.
ALSO READ : సముద్రంపై సర్ప్రైజింగ్ అడ్వెంచర్స్ చూపిస్తూ..కింగ్స్‌టన్
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన న్యూస్ వైరల్ అవుతుండటంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. తమ అభిమాన నటుడు కాలు కదిపితే భూకంపాలే అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చూడాలి మరి ఎన్టీఆర్-చరణ్ చేసిన నాటు నాటు పాటని మించేలా ఉంటుందోమో!
#JrNTR and #HrithikRoshan Begin Filming #War2's Epic Dance-off Sequence Today at Yash Raj Studios.
— Ramesh Pammy (@rameshpammy) March 4, 2025
Over 500 dancers will be a part of this electrifying dance battle, planned to be shot on a massive scale over six days... #BoscoMartis is choreographing this #Pritam musical! pic.twitter.com/MJSAk59jvi
భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇండియన్ రా ఏజెంట్గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారట. కేవలం ప్రత్యేక పాత్ర కోసం ఏకంగా రూ.100 కోట్లు అందుకోనున్నాడట ఎన్టీఆర్. ఈ విషయం తెలుసుకున్న బాలీవుడ్ స్టార్స్ అవాక్కవుతున్నరట.
కారణం.. అక్కడ చాలా మంది స్టార్స్ ఉన్నప్పటికీ ఏ హీరో కూడా ఫుల్ సినిమాకి సైతం రూ.100 కోట్లు రెమ్యునరేషన్గా అందుకోలేదు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ వంటి స్టార్స్ మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఇప్పుడు కేవలం స్పెషల్ రోల్ కోసం ఎన్టీఆర్ ఈ రేంజ్ లోల్ ఛార్జ్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై నెటిజన్స్ కూడా రియాక్ట్ అవుతున్నారు.