బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ 50 ఏళ్ళు పూర్తిచేసుకుని 51వ వసంతంలోకి అడుగుపెట్టాడు. దీంతో కుటుంబ సభ్యులు బర్త్ డే సెలబ్రేషన్స్ ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హృతిక్ రోషన్ బావమరిది జాయెద్ ఖాన్ బర్త్ డే వేడుకలకి సంబంధించిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ ఫొటోలలో హృతిక్ మాజీ భార్య సుస్సానే ఖాన్ తోపాటూ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ సబా ఆజాద్ కూడా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అలాగే మరికొంతమంది అభిమానులు హృతిక్ రోషన్ కి బర్త్ డే విషెష్ చెబుతున్నారు.
హృతిక్ మరియు సుస్సానే చిన్నప్పటినుంచి ప్రేమించుకుని 2000 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. కానీ అనుకోకుండా పెళ్లయిన 14 సంవత్సరాల తరువాత వీరిద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. పిల్లల సంరక్షణని ఇద్దరూ కలసి చూసుకుంటున్నారు. అయితే గత రెండేళ్లుగా హృతిక్ రోషన్ యంగ్ యాక్ట్రెస్, జిమ్ ట్రైనర్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడని అందుకే సుసాన్నె ఖాన్ విడాకులు ఇచ్చిందని పలు రూమర్స్ వినిపించాయి. దీనికితోడు పలుమార్లు హృతిక్ రోషన్, లవ్ సబా ఆజాద్ బహిరంగ ప్రదేశాల్లో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. దీంతో ఈ రూమర్స్ నిజమేనని కొందరు అంటున్నారు.
Also Read :- రామ్ చరణ్ కి సాధ్యం కానిది అల్లు అర్జున్ వల్ల అవుతుందా..?
ఈ విషయం ఇలా ఉండగా హృతిక్ రోషన్ ప్రస్తుతం వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి హిందీ ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, స్టార్ సినీ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో హృతిక్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఇప్పటికే దాదాపుగా 70% శాతం షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. దీంతో పాన్ ఇండియా భాషల్లో ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.