Fighter OTT: OTTకి వచ్చేసిన యాక్షన్ థ్రిల్లర్ ఫైటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

బాలీవుడ్ స్టార్ హ్రితిక్ రోషన్(Hrithik Roshan) హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ఫైటర్(Fighter). దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్(Siddarth Anand) తెరకెక్కించిన ఈ సినిమాలో దీపికా పదుకొనె(Deepika Padukone) హీరోయిన్ గా నటించగా.. సీనియర్ హీరో అనిల్ కపూర్(Anil Kapoor) కీ రోల్ లో కనిపించారు. ఎయిర్ ఫోర్స్ బ్యాక్డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే.. టీజర్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా రిలీజ్ తరువాత మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోయింది. తీసుకున్న బ్యాక్డ్రాప్, యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నప్పటికీ ప్రెజెంట్ చేసిన విధానం కొత్తగా లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు. దీంతో హ్రితిక్ కెరీర్ లో మరో ప్లాప్ మూవీగా నిలిచిపోయింది ఫైటర్. 

ప్రేక్షకుల నుండి నెగిటీవ్ టాక్ రావడంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. ఇక ఈ సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్నా నేపధ్యంలో తాజాగా ఫైటర్ సినిమాను ఓటీటీలో విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ మార్చ్ 20 నుండి ఫైటర్ సినిమాను స్ట్రీమ్ చేస్తోంది. అనుకున్న డేట్ కంటే ముందుగానే ఓటీటీ వచ్చిన ఫైటర్ చూసి హ్రితిక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో నెగిటీవ్ తెచ్చుకున్న ఫైటర్ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.