స్టార్ హీరో సినిమాకి బడ్జెట్ కష్టాలు.. రిలీజ్ అవ్వడం కష్టమే..?

స్టార్ హీరో సినిమాకి బడ్జెట్ కష్టాలు.. రిలీజ్ అవ్వడం కష్టమే..?

బాలీవుడ్ లో ప్రముఖ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటించిన క్రిష్ సీరీస్ సినిమాలకి మంచి క్రేజ్ ఉంది. అయితే క్రిష్ సినిమాలో హీరో హృతిక్ రోషన్ యాక్టింగ్, దర్శకుడు రాకేష్ రోషన్ టేకింగ్ ఇలా అన్నీ కూడా సెన్షేషన్ అని చెప్పవచ్చు. దీంతో 2006 లోనే క్రిష్ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్స్ ని ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఈ క్రమంలో హృతిక్ రోషన్ నటించిన క్రిష్ 2 కూడా బాగానే ఆకట్టుకుంది. క్రిష్ సీరీస్ సినిమాలని దర్శకుడు రాకేష్ రోషన్ దర్శకత్వం వహించడంతోపాటూ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 

రాకేష్ రోషన్ క్రిష్ 3 సినిమా కోసం హృతిక్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులని బట్టి చూస్తే  మరోసారి తీవ్ర నిరాశ ఎదురయ్యేట్లు కనబడుతోంది. ఐతే క్రిష్ 3 సినిమాకి బడ్జెట్ కష్టాలు వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాకేష్ రోషన్ కి బడ్జెట్ లేకపోవడంతో ఫండింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా వర్కౌట్ కానట్లు తెలుస్తోంది. దీంతో ప్రొడక్షన్ హౌజ్ మర్చి క్రిష్ 3 సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 

అయితే ఈమధ్య హృతిక్ రోషన్ నటించిన సినిమాలు కూడా పెద్దగా హిట్ అవ్వలేదు. ఈ క్రమంలో హృతిక్ రోషన్ నటించిన ఫైటర్, విక్రమ్ వేద తదితర సినిమాలు ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయాయి. దీంతో భారీ బడ్జెట్ వెచ్చించేందుకు మేకర్స్ ముందుకు రావడం లేదు. ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా హృతిక్ తో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు.