War 2: వార్ 2 షూటింగ్ వాయిదా..ఎన్టీఆర్-హృతిక్ డ్యాన్స్ రిహార్సల్లో ప్రమాదం!

War 2: వార్ 2 షూటింగ్ వాయిదా..ఎన్టీఆర్-హృతిక్ డ్యాన్స్ రిహార్సల్లో ప్రమాదం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో 'వార్ 2' సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్గా వస్తున్న ఈ మూవీని దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వార్ 2 సెట్లో హృతిక్ రోషన్ గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం అంధేరీలోని యష్ రాజ్ స్టూడియోస్‌లో ఎన్టీఆర్-హృతిక్ లపై స్పెషల్ సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ హై-ఎనర్జీ డ్యాన్స్ రిహార్సల్లో భాగంగా హృతిక్ కాలికి గాయమైనట్లు ప్రముఖ బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి.

హృతిక్ రోషన్ కాలు నయం కావడానికి నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు అతనికి సలహా ఇచ్చారు. దాంతో వార్ 2 షూటింగ్ పోస్ట్ఫోన్ కానున్నట్లు మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇక ఎన్టీఆర్-హృతిక్ల రాక కోసం, ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, వార్ 2 షూటింగ్ వాయిదా పడిందనే న్యూస్ వస్తుండటంతో.. తమ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 

ఈ పాట విషయానికి వస్తే.. 

వార్2లో వచ్చే ఓ ఎపిక్ డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్ గా ఈ సాంగ్ రాబోతుంది. ఇందులో 500 మందికి పైగా డ్యాన్సర్లు ఈ అద్భుతమైన నృత్య యుద్ధంలో పాల్గొంటారు. ఆరు రోజుల పాటు భారీ స్థాయిలో ఈ ఎపిక్ డ్యాన్స్-ఆఫ్ సీక్వెన్స్ను షూట్ చేయటకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఇది క్లైమాక్స్ ఫైట్ సెట్-పీస్‌లోకి వెళ్ళే ఒక అద్భుతమైన డ్యాన్స్ యుద్ధంని మేకర్స్ చెబుతున్నారు. 

ALSO READ | KCPD Lyrical: కిరణ్‌ అబ్బవరం కాలేజ్ మాస్.. ఇచ్చి పడేసేలా దిల్‌‌రూబా స్టూడెంట్ అంతేమ్..

ప్రీతమ్ మ్యూజికల్‌లో రానున్న ఈ సాంగ్ని బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ చేస్తున్నాడు. ఇందుకోసం ప్రొడక్షన్ డిజైనర్ అమృత మహల్ అద్భుతమైన సెట్‌ను నిర్మించారని, ప్రీతమ్ చాలా ఫాస్ట్ బీట్తో సాగే పాటను కంపోజ్ చేశారని బాలీవుడ్ నివేదికలు చెబుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ లెవల్లో ఉండేలా ఈ సాంగ్ రాబోతుందట.

ఫాస్ట్ అండ్ నాటు బీటుకు మెరుపు వేగంతో చరణ్, ఎన్టీఆర్ వేసిన స్టెప్స్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్స్ వేసిన మ్యాజికల్ స్టెప్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. అంతేకాదు.. ఈ రేంజ్ లో మరో సాంగ్ రావడం కూడా కష్టమే అనేంతలా మ్యాజిక్ చేసింది ఈ పాట. మరి తారక్-హృతిక్ ల స్టెప్పులు ఎలా ఉండనున్నాయి చూడాలి. 

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది.