లవ్ సింబల్ తో గర్ల్ ఫ్రెండ్ కి విషెష్ చెప్పిన హృతిక్ రోషన్.

లవ్ సింబల్ తో గర్ల్ ఫ్రెండ్ కి విషెష్ చెప్పిన హృతిక్ రోషన్.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ బాలీవుడ్ ప్రముఖ నటి సబా ఆజాద్‌ కి ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ హ్యాపీ బర్త్ డే సభా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆలాగే ఇందులో లవ్ సింబల్ ఎమోజీని కూడా షేర్ చేశాడు. దీంతో ఈ విషయం బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. 

అయితే సబా ఆజాద్ ప్లే బ్యాక్ సింగర్ గా పని చేసేది. అలాగే పలువురి స్టార్ హీరోయిన్లకి వాయిస్ డబ్బింగ్ కూడా చెప్పేది. ఈ క్రమంలో గతంలో హృతిక్ హీరోగా నటించిన సినిమాలకి సబా ఆజాద్ పని చేసింది. దీంతో వీరిద్దరికీ పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే సబా తో ప్రేమ కారణంగానే హ్రితిక్ రోషన్ తన భార్య సుసాన్నె ఖాన్ కి విడాకులు ఇచ్చాడని అప్పట్లో పలు వార్తలు బలంగా వినిపించాయి.

అయితే ఈమధ్య హృతిక్ రోషన్ సబా ఆజాద్‌ తో కలసి చెట్టాపట్టాలేసుకుని తిరుగున్నాడు. ఈ క్రమంలో వీరిద్దరూ కలసి సహజీవనం చేస్తున్నారని బాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు. సినిమాకి బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. వార్ 2 లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. దీంతో బాలీవుడ్, టాలీవడ్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం వార్ 2 ముంబై నగరం పరిసరప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్నట్లు సమాచారం.