క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకానున్న హృతిక్

క్రైమ్ బ్రాంచ్ పోలీసుల ఎదుట హాజరుకానున్న హృతిక్
  • తనతో అఫైర్ నడిపాడన్న కంగనా రనౌత్ కామెంట్స్ పై  కేసు పెట్టిన హృతిక్
  • 2016 నుండి పెండింగ్ లో ఉన్న కేసు
  • కంగనా రనౌత్ తో అఫైర్ పై ఏం చెబుతాడనిఉత్కంఠ

ముంబై: బాలీవుడ్ స్టార్స్ కంగనా రనౌత్-హృతిక్ రోషన్ మధ్య అఫైర్ గురించిన వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రేపు తమ ముందు హాజరై వాంగ్మూలం ఇవ్వాలంటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. తనతో అఫైర్ నడిపాడంటూ కంగనా రనౌత్ చేసిన కామెంట్స్ ఫేక్ అంటూ ఆగ్రహంతో రగిలిపోయిన హృతిక్ ఆమె మీద 2016లో ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఏళ్లు గడచినా హీరోగారు ఇప్పటికీ ఏమాత్రం కోపం తగ్గించుకోలేదు. దీంతో అటకెక్కించిన కేసు ఫైల్ దుమ్ముదులిపిన ముంబై పోలీసులు విచారణ బాధ్యతను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు అప్పగించగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు దుమ్ముదులిపే ప్రయత్నం చేపట్టారు. ఇందులో భాగంగా రేపు శనివారం హాజరై కేసు గురించి వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా ముందుగా హీరో హృతిక్ కు  సమన్లు జారీ చేసింది. తానే కంప్లయింట్ చేసి బుక్ చేయించిన కేసులో బెట్టువీడనట్లు  వ్యవహరిస్తున్న హృతిక్ రోషన్ ఏం చెబుతాడన్నది ఉత్కంఠ రేపుతోంది. గతంలో కంగనా రనౌత్ చెప్పిన విషయాలన్నీ ఫేక్ అంటూ హృతిక్ కొట్టేశాడు. చాలా కాలం అయింది కాబట్టి కంప్లయింట్ విత్ డ్రా కూడా చేసుకోకపోగా మరింత సీరియస్ గా పోలీసులపైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఒ కథనం ప్రచారంలో ఉంది. ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి తన పేరుతో కంగనాకి పంపి ఉంటారని గట్టిగా వాదించడమే కాదు.. పలుమార్లు ట్వీట్ కూడా చేశాడు. ముగిసిపోయిన అంకమంటూ చాలా కాలంగా సైలెంట్ అయిన కంగనా-హృతిక్ వ్యవహారం కాస్తా క్రైమ్ బ్రాంచ్ పోలీసుల సమన్లతో  మరోసారి హాట్ టాపిక్ అయింది. రేపు శనివారం క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరై హృతిక్ ఏమని వాంగ్మూలం ఇస్తాడనేది ఉత్కంఠ కలిగిస్తోంది. టీకప్పులో తుపానులా ముగిసిపోతుందని భావించేందుకు వీలు లేకుండా కేసు ఐదారేళ్లుగా పెండింగ్ లో ఉండిపోయింది. మళ్లీ ఇప్పుడు తెరపైకి వచ్చిన నేపధ్యంలో కేసును మూసేస్తారా..? లేక  తేల్చేస్తారా..? లేక సైలెంట్ అయిపోతారా.. ?  అంటూ బాలీవుడ్ వర్గాల్లో రకరకాల కథనాలు ప్రచారం జరుగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

శివరాత్రి ఉత్సవాలకు సీఎం జగన్ కు ఆహ్వానం

4 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

28న ‘ప్రైవేట్‌’తో ఇస్రో తొలి ప్రయోగం

పోలీసుల మెరుపు వేగం.. 3 గంటల్లో కిడ్నాపర్ల అరెస్టు