కౌలాలంపూర్ : ఇండియా స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్, యంగ్ ప్లేయర్ మాళవిక బన్సొద్ మలేసియా ఓపెన్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో ప్రికార్టర్ ఫైనల్ చేరుకున్నారు. మిక్స్‌డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో–ధ్రువ్ కపిల, సతీష్ కుమార్–ఆద్య వరియాథ్ కూడా ముందంజ వేశారు. బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రణయ్ 21–12, 17–21, 21–15తో కెనడాకు చెందిన బ్రియాన్ యాంగ్‌పై మూడు గేమ్స్ పాటు పోరాడి గెలిచాడు. మరో మ్యాచ్‌లో ప్రియాన్షు రజావత్ 11–21, 16–21తో ఏడో సీడ్ షి ఫెంగ్ లీ (చైనా) చేతిలో ఓడిపోయాడు.
ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్.. ఫెంగ్ లీతో పోటీ పడనున్నాడు. విమెన్స్ సింగిల్స్‌లో మాళవిక 21–15, 21–16తో లోకల్ ఫేవరెట్ గోహ్ జిన్ వీపై విజయం సాధించింది. మిక్స్‌డ్‌లో కపిల–క్రాస్టో 21–13, 21–14తో సౌత్ కొరియాకు చెందిన సుంగ్ హ్యున్ కొ–హై వాన్ యివోమ్‌పై నెగ్గగా, సతీష్–ఆద్య 21–13, 21–15తో ఇండియాకే చెందిన అష్మిత్ సూర్య–అమృతను ఓడించారు. విమెన్స్ డబుల్స్‌లో రుతపర్ణ–శ్వేతపర్ణ 17–21, 10–21తో బెన్యప–నుంటకార్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయారు.