
హెచ్ఎస్సీసీలో మేనేజర్ ఖాళీలు
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి హాస్పిటల్సర్వీసెస్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అప్లికేషన్లను కోరుతున్నది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్ 14వ తేదీలోగా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు.
పోస్టుల సంఖ్య: 14
పోస్టులు: డిప్యూటీ మేనేజర్ 05, మేనేజర్ 03, సీనియర్ మేనేజర్ 03, డిప్యూటీ జనరల్ మేనేజర్ 02, జనరల్ మేనేజర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ, సీఏ, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి 49 ఏండ్లు మించకూడదు.
అప్లికేషన్: ఆన్ లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: ఏప్రిల్ 14.
సెలెక్షన్ ప్రాసెస్: ప్రతిపోస్టుకు వచ్చే అప్లికేషన్లను అనుసరించి సెలెక్షన్ ప్రాసెస్ను హెఎస్సీసీ నిర్ణయిస్తుంది.