Union Budget 2025: బడ్జెట్లో బీహార్కు భారీ కేటాయింపులు..

Union Budget 2025: బడ్జెట్లో బీహార్కు భారీ కేటాయింపులు..

శనివారం ( ఫిబ్రవరి 1, 2025 ) లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. మోడీ 3.0లో ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. ఈ బడ్జెట్ లో బీహార్ కు భారీ కేటాయింపులు చేసింది కేంద్రం. బీహార్ లో త్వరలో ఎన్నికలు జరగునున్న క్రమంలో బీహార్ కేటాయింపులకు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. బీహార్ కు మూడు కీలక ప్రాజెక్టులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు నిర్మలా సీతా రామన్. అంతే కాకుండా బీహార్ లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టు, మకాన్ బోర్డు ఏర్పాటు వంటి కీలక కేటాయింపులు బీహార్ కు లభించాయి.

ఇదిలా ఉండగా.. రూ. 12 లక్షల వరకు పన్ను మినహాయింపు ప్రకటించటం ఈ బడ్జెట్ కి హైలైట్ గా నిలిచింది. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు క్రెడిట్ కార్డులు, రూ.10లక్షల విలువైన క్రెడిట్ కార్డులు, ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2కోట్ల రుణాలు వంటివి ఈ బడ్జెట్ లో ప్రధానంగా నిలిచాయి. 

Also Read :- కేంద్ర బడ్జెట్ లైవ్ అప్ డేట్స్

మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగం మొదలు కాగానే విపక్షాలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశాయి. కేంద్ర వైఖరికి నిరసనగా సమావేశాల నుండి వాకౌట్ చేశాయి విపక్షాలు. దీంతో సభలో విపక్షం లేకుండానే బడ్జెట్ ప్రవేశపెట్టారు మంత్రి నిర్మలా సీతారామన్. ఇదిలా ఉండగా.. గురజాడ పద్యం " దేశమంటే మట్టి కాదోయ్ " తో బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించారు నిర్మల సీతారామన్.