
హైదరాబాద్సిటీ, వెలుగు: బాబాసాహెబ్ అంబేద్కర్135వ జయంత్యోత్సవాల సందర్భంగా నెక్లెస్ రోడ్లోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద హెచ్ఎండీఏ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. రాత్రి వేళ సందర్శకులకు కనువిందు చేసేలా కలర్ఫుల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. అంబేద్కర్ మెమోరియల్వద్ద ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
అంబేద్కర్ సిద్ధాంతాలు ప్రస్తుత, రాబోయే జనరేషన్లకు అర్థమయ్యే రీతిలో తీర్చిదిద్దారు. అంబేద్కర్ విజన్, సోషల్ ఎంపవర్మెంట్పేరుతో కార్యక్రమాలను రూపొందించారు. ఎగ్జిబిషన్ఏర్పాటుకు రెండు వారాలుగా 90 మంది ఫైన్ఆర్ట్స్, ఆర్కిటెక్చర్విద్యార్థులు సహకరించారని చెప్పారు. అంబేద్కర్ ఫొటోగ్రఫీ జర్నీ, అందరికీ అర్థమయ్యేలా అంబేద్కర్ ఫిలాసఫీ ఫొటోలు, శాంతి, స్పిరుచువల్లిబరేషన్, ఈక్వాలిటీ, బుద్దిజంపై ఫొటోలను ఏర్పాటు చేశారు.