చిలుకూరి, టీటీడీ ఆలయాల్లో భారీ ఏర్పాట్లు

చిలుకూరి, టీటీడీ ఆలయాల్లో భారీ ఏర్పాట్లు

చేవెళ్ల/బషీర్​బాగ్, వెలుగు : న్యూఇయర్​సందర్భంగా బుధవారం చిలుకూరు బాలాజీ ఆలయం, హిమాయత్​నగర్, జూబ్లీహిల్స్​లోని టీటీడీ ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది. చిలుకూరు బాలాజీని లక్ష మందికి పైగా దర్శించుకునే అవకాశం ఉందని  నిర్వాహకులు చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగా పార్కింగ్, క్యూలైన్లు ఏర్పాటు చేశారు. బుధవారం తెల్లవారుజామున 4 గంటల నుంచే భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించారు.

అలాగే హిమాయత్ నగర్ ఆలయంలో తెల్లవారు జామున 4 నుంచి శ్రీవారి సేవలు, వీఐపీ, సర్వ దర్శనలు ఉంటాయని ఏఈఓ రమేశ్​తెలిపారు. జూబ్లీహిల్స్ టీటీడీ ఆలయంలో ఉదయం 7 నుంచి దర్శనాలు, సేవలు మొదలవుతాయని చెప్పారు. రెండు చోట్ల తిరుపతి లడ్డూ విక్రయం ఉంటుందన్నారు.