
యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. 24 ప్యాకెట్లలో అమర్చిన 51.13 కిలోల గంజాయిని భువనగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొత్తం గంజాయి విలువ 14 లక్షల 50 వేల రూపాయలు ఉంటుందని తెలిపారు.
గంజాయి రవాణా చేస్తోన్న ముగ్గురు నిందితులు మహమ్మద్ ఆమిర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇస్మాయిల్ (s/o ఇక్బాల్) ను అదుపులోకి తీసున్నట్లు తెలిపారు. భాష అనే మరో నిందితుడు పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితుల నుంచి కారు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
►ALSO READ | హైదరాబాద్లో భారీగా డ్రగ్స్ సీజ్.. పట్టుబడ్డ మాజీ సీఎస్ కొడుకు.!