వనపర్తి పట్టణంలో శుక్రవారం ఓ వ్యక్తి ఇంట్లో ఈ భారీ నాగుపామును పట్టుకున్నారు. ఇంట్లోని బాత్ రూమ్లో పాము చొరబడిందని సాగర్ స్నేక్ సొసైటీ నిర్వాహకులు, హోంగార్డు కృష్ణ సాగర్ కు సమాచారం రాగా ఆయన వచ్చి పామును పట్టుకున్నారు. అయితే, అది సుమారు ఆరు ఫీట్ల ఒక ఇంచు పొడవు ఉండడంతో ఆశ్చర్యపోయారు. నాగుపాములు ఐదడుగులు మాత్రమే ఉంటాయని, కానీ, ఇంత పొడవు నాగుపామును 12 ఏండ్లలో ఎప్పుడూ చూడలేదన్నారు. తర్వాత సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు.