ఆ ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి భారీ పోటీ

వరంగల్,ఖమ్మం,నల్గొండ గ్రాడ్యుయేట్స్ స్థానానికి పోటీ ఎక్కువగా ఉంది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, యువ తెలంగాణ పార్టీలతో పాటు.. స్వతంత్రులు కూడా భారీగా పోటీ పడుతున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి రాములు నాయక్, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, టీజేఎస్ నుంచి కోదండరామ్, యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమతో పాటు.. తీన్మార్ మల్లన్న స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాలు భర్తీ చేయనందుకు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న కొందరు విద్యార్థి నాయకులు, గ్రాడ్యుయేట్స్ కూడా నామినేషన్స్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు.