రూ.కోటి 38 లక్షల కోట్లు కేటాయింపు
‘కొవిడ్ రెస్క్యూ ప్లాన్’ ప్రకటించిన బైడెన్
వైరస్ కంట్రోల్, ఎకానమీ బలోపేతంపైనే ఫోకస్
వాషింగ్టన్, విల్మింగ్టన్ (యునైటెడ్ స్టేట్స్): కరోనా మహమ్మారి ధాటికి విలవిల్లాడిన అమెరికన్లను ఆదుకునేందుకు భారీ ప్యాకేజీతో ‘కొవిడ్ రెస్క్యూ ప్లాన్’ను రూపొందించినట్లు అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రకటించారు. అటు వైరస్ ను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఇటు జనాలకు నేరుగా డబ్బులు పంచడం ద్వారా ఎకానమీని మళ్లీ పరుగులెత్తిస్తామని ఆయన వెల్లడించారు. ఇందుకోసం1.9 లక్షల కోట్ల డాలర్ల (రూ. 1 కోటి 38 లక్షల 88 వేల 145 కోట్లు)తో ‘అమెరికన్ రెస్క్యూ ప్లాన్’ను చట్టరూపంలో అమలు చేస్తామని ప్రకటించారు. గురువారం రాత్రి నార్త్ కరోలినా స్టేట్ లోని విల్మింగ్టన్ లో కాబోయే వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ తో కలిసి బైడెన్ పబ్లిక్ స్పీచ్ ఇచ్చారు. ‘‘దేశం ఇప్పుడు పబ్లిక్ హెల్త్, ఎకనమిక్ క్రైసిస్ ను ఎదుర్కొంటోంది. వీటిని వెంటనే పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను అమెరికన్ రెస్క్యూ ప్లాన్ ను ప్రకటిస్తున్నా. మనమంతా కలిసికట్టుగా విపత్తును సవాల్ చేద్దాం. ఎకానమీ రికవరీ అయ్యేందుకు ఒక బ్రిడ్జిని నిర్మిద్దాం” అని ఆయన పిలుపునిచ్చారు.
బైడెన్ ‘ప్లాన్’లో ఏమున్నయ్?
అమెరికన్లకు డైరెక్ట్ గా డబ్బులు పంపిణీ చేయడం, నిరుద్యోగులకు బెనిఫిట్స్ ను పెంచడం, స్టేట్, లోకల్ గవర్నమెంట్లకు మరిన్ని ఫండ్స్, వ్యాక్సినేషన్, వైరస్ టెస్టింగ్ ప్రోగ్రాంలను మరింత విస్తరించడం వంటివి బైడెన్ ప్రకటించిన అమెరికన్ రెస్క్యూ ప్లాన్‌లో ఉన్నాయి. డబ్బును నేరుగా ఎకానమీలోకి పంప్ చేయడం, వైరస్ నివారణపైనే ఈ ప్లాన్‌లో ఫోకస్ పెట్టారు. పవర్లోకి వచ్చిన 100 రోజుల్లోగా 100 మిలియన్ డోసుల వ్యాక్సిన్లు వేయిస్తామని బైడెన్ ఇదివరకే ప్రకటించారు. ఆ దిశగా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మరింత విస్తరించడంపైనా ఆయన దృష్టి పెట్టారు.
బైడెన్, కమల ప్రమాణస్వీకారం..
ఈ నెల 20న జరగనున్న బైడెన్, కమల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి శ్రీలంక సంతతికి చెందిన ఇండియన్ ఆర్కెస్ట్రా ప్లేయర్ నివంతి కరుణరత్నేకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. బైడెన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పాప్ స్టార్లు లేడీ గాగా, జెన్నిఫర్ లోపెజ్ పర్ఫామెన్స్ ఇవ్వనున్నారు.
హౌజ్‌లో ఇంపీచ్‌మెంట్ పూర్తి
అమెరికా క్యాపిటల్ బిల్డింగ్‌పై దాడికి తన మద్దతుదారులను రెచ్చగొట్టిన ట్రంప్ ను ప్రతినిధుల సభ రెండోసారి ఇంపీచ్ (అభిశంసన) చేసింది. దీంతో అమెరికా హిస్టరీలో రెండుసార్లు అభిశంసనకు గురైన ఏకైక ప్రెసిడెంట్‌గా ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు. రిపబ్లికన్ పార్టీనుంచి పదిమంది సభ్యులు ఇంపీచ్‌మెంట్ తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్‌లో 232–197 ఓట్ల తేడాతో ట్రంప్‌పై ఇంపీచ్‌మెంట్ ప్రాసెస్ ముగిసింది. ఇంతకుముందు 2019, డిసెంబర్ 18న హౌజ్ తొలిసారి ట్రంప్‌ను ఇంపీచ్ చేసింది. సెనెట్‌లో మెజారిటీ రిపబ్లికన్లదే కావడంతో ట్రంప్ సేవ్ అయ్యారు.
For More News..