
- బంధించిన స్నేక్ సొసైట్ టీమ్
పెబ్బేరు, వెలుగు : రైతు పొలంలో భారీ మొసలి కనిపించి భయాందోళనకు గురి చేసింది. చివరకు దాన్ని బంధించడంతో ఊపిరి పీల్చుకున్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన రైతు మోడాల నరసింహ ఆదివారం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరు ఆన్ చేయడానికి వెళ్లగా అక్కడ భారీ మొసలి కనిపించడంతో భయాందోళన చెంది పరుగు తీశాడు. గ్రామానికి వెళ్లి చెప్పగా స్థానికులు వనపర్తిలోని సాగర్ స్నేక్స్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణ సాగర్‌కు, పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే వచ్చి మొసలిని బంధించారు. దాని బరువు 3 క్వింటాళ్లు ఉంటుందని చెప్పారు. అనంతరం ట్రాక్టర్ లో మొసలిని వేసుకొని వెళ్లి బీచుపల్లి వద్ద కృష్ణ నదిలో వదిలిపెట్టారు. సొసైటీ సభ్యులు కుమార్ సాగర్, గోపాల్ యాదవ్, దేవేందర్, రాజు, పోలీస్ సిబ్బంది కర్ణాకర్ గౌడ్, కురుమయ్య ఉన్నారు.