త్రిపురారం వరిపొలంలో మొసలి కలకలం

హాలియా, వెలుగు: నదులు, రిజర్వాయర్లలో  ఉండాల్సిన మొసలి  పంట పొలంలో కనిపించడం  కలకలం రేకెత్తించింది.  నల్గొండ జిల్లా త్రిపురారంలోని  దేవుని మాన్యం భూమిలో నాగయ్య అనే రైతు వరి  సాగు చేశాడు. గురువారం ఉదయం పొలానికి వెళ్లిన నాగయ్య పొలమంతా  తొక్కినట్టు కనిపించడంతో  దగ్గరికి వెళ్లి చూడగా మొస‌లి కనిపించింది.

 మొసలిని చూసి భయపడిన  రైతు  గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు.   ముసలి చూడడానికి జనం బారులు తీరారు.  ఫారెస్ట్ అధికారులు వచ్చి  మొసలిని  తాళ్లతో బంధించి..   నాగార్జునసాగర్ వద్ద కృష్ణా నదిలో విడిచిపెట్టారు. గ్రామ సమీపంలోని  చెరువు నీటి ద్వారా మొసలి పొలంలోకి వచ్చిందని రైతులు భావిస్తున్నారు.