యాదాద్రిలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి 2 గంటల టైమ్

యాదాద్రిలో భక్తుల రద్దీ కోనసాగుతుంది. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.  ఉచిత దర్శనానికి  2 గంటలు, ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి గంట సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.  ప్రసాద విక్రయ శాల, శ్రీసత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్లాండ్‌లో భక్తుల రద్దీ నెలకొంది.