యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 4 గంటలు

యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుడిని దర్శనానికి బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనానికి భక్తులు క్యూ కట్టారు. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఆలయ పరిసర ప్రారంతాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. 

స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, కల్యాణ కట్ట ప్రాంతాల్లో భక్తుల కోలాహలం నెలకొంది. భక్తలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ​అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.