యాదాద్రి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం సెలవు రోజు కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. క్యూలైన్ లో భక్తులు బారులు తీరారు. స్వామివారి ఉచిత దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ 150 రూపాయల దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.
ఇక, యాదాద్రి పాతగుట్టలో ఆదివారంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈరోజు స్వామివారికి అష్టోత్తర శత ఘట్టాభిషేకం నిర్వహించి బ్రహ్మోత్సవాలకు ముగింపు పలకనున్నారు అర్చకులు.