కల్కి మూవీ.. థియేటర్లలో భారీ కటౌట్లు..!

కల్కి మూవీ.. థియేటర్లలో భారీ కటౌట్లు..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా గురువారం విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్ థియేటర్లలో హీరో ప్రభాస్ కటౌట్లు భారీ ఎత్తున దర్శనమిస్తున్నాయి. ప్రభాస్ కటౌట్ ల ముందు డ్యాన్సులు చేస్తున్నారు ఫ్యాన్స్.   ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. హీరో ప్రభాస్ అభిమానులు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, అర్ధరాత్రి నుంచి భారీగా సంబరాలు చేసేందుకు సిద్ధమయ్యారు. కల్కి సంబరాలతో రేపు హైదరాబాద్ దద్దరిల్లనుంది. రేపు ఉదయం 4.30 కి మొదటి షో ప్రారంభం కానుంది.  ఇప్పటికే  మొదటి మూడు రోజుల టికెట్స్  పూర్తిగా బుక్ అయిపోయింది.  దీంతో భారీగా బ్లాక్ లో టికెట్స్ కొనుకుంటున్నారు ఫ్యాన్స్.  కాగా ఈ సినిమా కథ మహాభారతం ముగింపులో మొదలై కలియుగం చివరిలో ముగుస్తుందని తెలుస్తోంది.  డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కించగా..  వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.