హైదరాబాద్లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. రూ.10 లక్షలు పలికిన నెంబర్

హైదరాబాద్లో ఫ్యాన్సీ నెంబర్ల వేలం.. రూ.10 లక్షలు పలికిన నెంబర్

హైదరాబాద్ లో ఫ్యాన్సీ నెంబర్ల వేలానికి భారీ స్పందన వచ్చింది. శనివారం రవాణా శాఖ కార్యాలయంలో (ఆర్టీఓ) నిర్వహించిన వేలంలో ఔత్సాహికులు పాల్గొని ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసి నచ్చిన నెంబర్లను దక్కించుకున్నారు. 

రంగారెడ్డి జిల్లా మణికొండలోని ఆర్టీఓ ఆఫీస్ లో ఇవాళ (మార్చి 1) ఫ్యాన్సీ నెంబర్ల  వేలంలో ఫ్యాన్సీ నెంబర్లు భారీ మొత్తంలో ధర పలికాయి. లక్షలు కుమ్మరించి నచ్చిన నంబర్లను దక్కించుకున్నారు వాహనదారులు.

నెంబర్లలో టీజీ07 పి9999  నెంబర్‌కు రూ. 9.37 లక్షలతో ముప్పా ప్రాజెక్ట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ దక్కించుకుంది. అలాగే టీజీ07 పి0009 ఫ్యాన్సీ నెంబర్‌ను 7.50 లక్షలకు కేఎల్‌ఎస్‌ఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ వారు దక్కించుకున్నారు. 

ఈ ఒక్క రోజే రవాణా శాఖకు ఫ్యాన్సీ నెంబర్ల పైన 37 లక్షల రూపాయల ఆదాయం వచ్చినట్లు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ సదానందం తెలిపారు.