
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. వరుస సెలవులు రావడంతో రాష్ట్రా నలుమూలల నుండి భారీ సంఖ్యలో తరలివచ్చారు భక్తులు.దీంతో ఆలయ ప్రాంగణం మల్లన్న నామస్మరణతో మారుమోగుతుంది. స్వామివారికి అభిషేకాలు, అర్చనలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు.
పట్నాలు, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. మహామండపంలో స్వామివారికి కల్యాణం నిర్వహించి ఓడిబియ్యం పోసి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి 2 గంటలు, ధర్మ దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించారు ఆలయ అధికారులు.